NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

రాజకీయ “గంట” మోగడం లేదేందుకనో…?

అమరావతి: తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇది ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర పేరుతో విశాఖలో అడుగు పెట్టిన సందర్భంలోనూ ఆయన కనిపించలేదు. రెండు రోజుల క్రితం విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబును అడ్డుకొని వెనక్కు పంపినా ఆయన స్పందించిన దాఖలాలు లేవు. ఎన్నికల్లో టీడీపి ఘోర పరాజయం తరువాత పార్టీ లో గంటా సైలెంట్ గా ఉండిపోయారు. దీనితో అయన టీడీపీని వీడి బిజెపి లోనో, వైసీపీ లోనో చేరనున్నారంటూ సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ఆయన చర్యలను పరిశీలకులు గమనించారు. అసెంబ్లీ సమావేశాల్లో మొక్కుబడిగా హాజరు అవ్వడంతో పాటు పార్టీ స్టాండ్ కు భిన్నంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతించారు.
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయడాన్ని అయన బాహాటంగానే సమర్ధించారు. అయన పార్టీ మారనున్నారు అంటూ వచ్చిన ప్రచారాలను కొట్టి పారేస్తూ వచ్చినా ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. స్థానిక సెంటిమెంట్ కారణంగానే గంటా ఈ విషయంలో దూరంగా ఉంటున్నారని వినబడుతోంది. అయితే అయన పార్టీ మార్పు ఊహాగానాలను పటాపంచలు చేస్తూ కొందరు బిజెపి నాయకులను ఆయన ఆధ్వర్యంలో ఇటీవల టీడీపిలో చేర్పించారు. దీనితో అయన పార్టీలో యాక్టీవ్ రోల్ తీసుకుంటారని భావించారు. కానీ విశాఖలో పార్టీ అధినేత చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినా గంటా మౌనంగానే ఉండిపోయారు. గంటా రాజకీయ నేపధ్యం చూసినా పార్టీలు మారిన చరిత్ర ఉన్నది.1999లో రాజకీయాల్లో ప్రవేశించి తొలి ప్రయత్నంలోనే అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందాడు. 2004 ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. 2014 ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలో చేరి భీమిలి ఎమ్మెల్యేగా గెలిచాడు.
చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్థానం సంపాదించాడు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఆ తరువాత తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి సీనియర్ నేతగా ఉన్న గంటా ప్రస్తుత రాజకీయ పరిణామాలలో మౌనంగా ఉండటం దేనికి సంకేతం అనేది కాలమే చెప్పాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

Leave a Comment