కేసీఆర్ మాటకు జవాబు ఏది?

విజయవాడ, డిసెంబర్ 30 : ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం పార్టీ నేతల కోసం ఒక పిచ్చాస్పత్రి కట్టించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు  టీడీపీ నేతలు సమాధానం చెప్పలేక పోయారన్నారు. హైకోర్టు విభజన విషయంలో కేసీఆర్ అడిగిన ప్రశ్నలు దాట వేయడానికి మంత్రులు, టీడీపీ నేతలు బీజేపీపై మాటల దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. హైకోర్టు భవనాలు సిద్ధంగా ఉన్నాయని అబద్ధాలు చెప్పారన్నారు. కేంద్రం హైకోర్టు భవనాల నిర్మాణానికి  500 కోట్ల రూపాయలు మంజురు చేసిందన్నారు. హైకోర్టు భవనాలకు కేంద్రం ఇచ్చిన నిధులను టీడీపీ నేతలు ఏం చేశారో చెప్పాలని విష్ణువర్థన్‌రెడ్డి కోరారు.