NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జూపూడి మేటర్ లో జగన్ వైఖరి దేనికి సంకేతం? పార్టీ మారి తిరిగివస్తే అంతే సంగతులా??

ఒకసారి పార్టీలో నుండి వెళ్లి మళ్లీ వచ్చిన వారికి ఎలాంటి ప్రాధాన్యత జగన్ ఇవ్వరనడానికి నిదర్శనంగా మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు నిలుస్తారు.మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలిచిన నెల రోజుల లోపే టిడిపి నుండి జూపూడి వైసిపిలోకి వచ్చేసినప్పటికీ ఆయనకు ఇప్పటి వరకు ఏ విధమైన ప్రాధాన్యతను జగన్ ఇవ్వడం లేదు .ప్రకాశం జిల్లాకు చెందిన ఈ దళిత నేత జగన్ తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి పుణ్యమా అని ఎమ్మెల్సీ అయ్యారు.

 What is the significance of Jagan's attitude in Jupudi Matter
What is the significance of Jagans attitude in Jupudi Matter

మాలమహానాడు అధ్యక్షుడిగా ఉంటూ విజయవాడ లో మాలల విశ్వరూప సభను నిర్వహించి దానికి రాజశేఖర్ రెడ్డిని ఆహ్వానించి ఆయన దృష్టిలో పడి జూపూడి ఎమ్మెల్సీ కాగలిగారు.డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం జగన్ వెంట జూపూడి నడిచారు. పార్టీలో చాలా కీలకమైన బాధ్యతలు అప్పట్లో జగన్ ఆయనకు అప్పగించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొండేపి టిక్కెట్ కూడా ఆయనకు ఇచ్చినప్పటికీ జూపూడి టిడిపి అభ్యర్థి బాలవీరాంజనేయస్వామి చేతిలో ఓడిపోయారు. వెనువెంటనే ఏ మాత్రం గ్యాప్ లేకుండానే జూపూడి తెలుగుదేశం లోకి దూరి పోయారు. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనమైంది. రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన జూపూడి పార్టీ మారడం జగన్ కి కూడా మనస్తాపం కలిగించింద౦టారు.ఇక తెలుగుదేశంలో చేరిన జూపూడికి చంద్రబాబునాయుడు బాగానే ప్రాధాన్యమిచ్చారు.ఎమ్మెల్సీ చేద్దామనుకుంటే చివరి నిమిషం లో సాంకేతిక పరమైన ఓటు హక్కు సమస్య తలెత్తడంతో ఆయన్ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు.అంతేగాకుండా టిడిపి మౌత్ స్పీకర్ గా జూపూడి పనిచేస్తూ అనేక న్యూస్ చానెళ్లలో వైసిపిని తీవ్రంగా దుమ్మెత్తి పోసేవారు. జగన్ పై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. ఇంతలో సీన్ మారింది .మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి చేసింది .

 What is the significance of Jagan's attitude in Jupudi Matter
What is the significance of Jagans attitude in Jupudi Matter

జగన్ సీఎం అయ్యారు.అంతే.. యథాప్రకారం మళ్లీ జూపూడి వైసీపీలోకి ప్రవేశించారు. ఆ తర్వాతనే వైసీపీలో ఆయన పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైంది. పార్టీలోకి అయితే చేర్చుకున్న జగన్ తనదైన శైలిలో జూపూడిని తొక్కి పెడుతున్నారు. పార్టీలో గాని ,ప్రభుత్వంలో గానీ జూపూడి కి ఎటువంటి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఏదైనా పదవిని ఇస్తారని జూపూడి ఆశించినా అది జరగడం లేదు. కనీస కొండేపి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పదవి అయినా ఇవ్వాలని జూపూడి కోరుకుంటున్నా వినేవారు కనిపించడం లేదు. పార్టీ వీడి వెళ్లి మళ్ళీ వచ్చే వారి విషయంలో జగన్ వైఖరి ఎలా ఉంటుందనడానికి జూపూడి వ్యవహారమే ఒక నిదర్శనం.

author avatar
Yandamuri

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju