NewsOrbit
రాజ‌కీయాలు

Ap Bjp: ప్రధాని ‘ఉక్కు’ సంకల్పం తెేలిపోయింది..! మరి రాష్ట్ర బీజేపీ ఏం చేస్తుందో..!?

Ap Bjp: ప్రధాని 'ఉక్కు' సంకల్పం తెేలిపోయింది..! మరి రాష్ట్ర బీజేపీ ఏం చేస్తుందో..!?

Ap Bjp:  ఇప్పుడు చాలా సంకట స్థితిలో ఉంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఇదంతా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ పుణ్యమే. దేశ ప్రయోజనాల కోసమే ఇదంతా అని కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇదే ఏపీ బీజేపీ Ap Bjp  పెద్ద తలనొప్పిని తెస్తోంది. విశాఖ ఉక్కు ప్రవైటీకరణపై ఏపీ ప్రజల భావోద్వేగాన్ని కేంద్రం ముందు ఉంచుతాం. ప్రైవేటీకరణ కాకుండా చూస్తాం అని అని ఢిల్లీ వెళ్లారు. కానీ.. మోదీ అపాయింట్ మెంట్ దక్కలేదు. సంబంధిత మంత్రిని కలసి వినతిపత్రం అయితే ఇచ్చి వచ్చారు. పరిస్థితి చూసి కేంద్రం వెనక్కు తగ్గుతుందని భావించిన ఏపీ బీజేపీకి నిన్న ప్రధాని మోదీ చెప్పిన మాటతో ఇక్కడ బీజేపీ నేతలకు ఏం మాట్లాడాలో అర్ధం కాని పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం వీరంతా విశాఖ ఉక్కుపై మీమాంశలో పడ్డారనే చెప్పాలి.

what next for ap bjp
what next for ap bjp

పార్టీల రాజకీయం..

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం వార్తల్లోకి వచ్చినప్పటి నుంచీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో.. ముఖ్యంగా విశాఖలో రాజకీయం మొదలైంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా, పల్లా శ్రీనివాసరావు దీక్ష, చంద్రబాబు విశాఖ పర్యటనతో టీడీపీ వేడెక్కించింది. అధికార వైసీపీ నుంచి కూడా రాజకీయం మొదలైంది. సీఎం జగన్ పర్యటన, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటన, విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ సహా ఎమ్మెల్యేల పాదయాత్ర.. ఇలా వైసీపీ వార్తల్లో నిలిచింది. బీజేపీ నేతలు కూడా పర్యటించి విశాఖను ప్రైవేటీకరణ కానివ్వమంటూ ప్రకటించింది. ఇంకా.. కేంద్రం ప్రకటన మాత్రమే చేసింది.. ఇంకా ప్రైవేటీకరణ చేయలేదు కదా అని కామెంట్ చేసింది. కాంగ్రెస్ తన ఉనికిని కాపాడుకేనే ప్రయత్నంలో ఓ పర్యటన చేసింది. ఇక ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న జనసేన మాత్రం ఇంతకు మించి రియాక్ట్ అయింది. ఏకంగా అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వినతిపత్రం కూడా ఇచ్చి వచ్చారు. వామపక్షాలు మాత్రం తమదైన విమర్శలతో విరుచుకుపడింది. మొత్తంగా రాజకీయం విశాఖ చుట్టూ తిరుగుతోంది. వీరందరి ఆశలపైనే ఇప్పుడు మోదీ నీళ్లు చల్లేశారు.

 

ప్రధానే చెప్పాక ఇంకేంటి..

ఏకంగా ప్రధాని మోదీ ప్రకటించేశారు కాబట్టి ఇక బీజేపీ నేతలు మారు మాట్లాడేందుకు అవకాశం లేకపోయింది. ఏపీలో పార్టీని నిలబెట్టాలి అని భావిస్తున్న బీజేపీ అధిష్టానానికీ ఈ నిర్ణయం కష్టమైనదే. ప్రస్తుతం ఏపీలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగబోతున్నాయి. త్వరలో తిరుపతి ఉప ఎన్నిక కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలకు మొదటగా వినిపించే ప్రశ్న విశాఖ ఉక్కు పరిశ్రమ గురించే. ఈ ప్రశ్నల నుంచి తప్పించుకుని వారు ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. ఇక్కడ జనసేన పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారుతోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ మాటకు కట్టుబడి ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. తిరుపతి ఉప ఎన్నిక సీటు ఆశిస్తోంది జనసేన. కానీ.. బీజేపీ సొంతంగా పోటీ చేయాలని భావిస్తోంది. మరి.. ఈ నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు ఒంటరిగా వెళ్తుందా? అనేదే ప్రశ్న.

 

జనసేన పరిస్థితి..

జనసేన పోటీ చేసినా బీజేపీతో పొత్తుతోనే వెళ్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ఎఫెక్ట్ జనసేనకు కూడా తగులుతుంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో జనసేన తాను మద్ధతు ఇచ్చిన అభ్యర్ధులను గెలిపించుకుని తన ఉనికిని ఘనంగానే చాటుకుంది. పార్టీ నాయకత్వం కంటే జనసైనికులే స్వతంత్రంగా పంచాయతీల్లో కష్టపడ్డారు. ఇంతటి సమరోత్సాహంలో ఉన్న జనసేనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అడ్డొస్తుందా. మున్సిపల్, తిరుపతి ఉప ఎన్నికల్లో విశాఖ ఉక్కు అంశం ప్రతికూలంగా మారుతుందా? అనేది వేచి చూడాల్సిన అంశం. ఇక బీజేపీ ప్రస్తుతానికైతే సైలెంట్ గా ఉంది. ఏపీలో బలపడే ప్రయత్నంలో ఈ అంశం ఆ పార్టీపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. మరోపక్క టీడీపీ, వామపక్షాలు ఇప్పటికే ఏపీ బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేస్తున్నాయి. మరి ఏపీ బీజేపీ ఎలా బదులిస్తుందో చూడాల్సి ఉంది.

 

 

author avatar
Muraliak

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju