NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జస్టిస్ మీ బాధ ఏంటి అసలు!! రాకేష్ కుమార్ తీరు లో విచిత్రాలు

 

 

**నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందని అలా చేసి రకరకాల మాటలు అని మీడియా పతాక శీర్షికల్లో ఎక్కిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేష్కుమార్ తీరు ఇప్పుడు ఆశ్చర్యానికి సంభ్రమాశ్చర్యానికి మధ్యన ఊగిసలాడుతోంది. ఆయన ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాక న్యాయ నిపుణులు సైతం నోరెళ్లబెడుతున్నారు. రోజుకో ప్రెస్ స్టేట్మెంట్ను వదులుతూ తెదేపా అనుకూల మీడియా లో పతాక శీర్షికలో వచ్చేందుకు ఆయన పడుతున్న ఆరాటం నవ్వు తెప్పిస్తోంది అని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సోమవారం ఆయన చేసిన కామెంట్ ఏమిటంటే… ఊపిరి ఉన్నంతవరకు న్యాయవ్యవస్థను కాపాడుతా… అని. ఈ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

** రాష్ట్ర ప్రభుత్వంపైన హైకోర్టులో ఉన్న కేసుల్లో రాకేష్ కుమార్ బెంచ్ లో ఉన్న కేసులు 5. వాటిలో అన్నింటిపైనా రాకేష్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో కేసులో ఆయన అసహనం వ్యక్తం చేయడమే గాక కంట్రోల్ కోల్పోయి, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందని వ్యాఖ్యలు చేయడం పెద్ద సంచలనం అయ్యింది. ఇది తెదేపా అనుకూల మీడియా లో పతాక శీర్షికలుగా వచ్చింది. అయితే తాజాగా జగన్ ప్రభుత్వం పలు కేసుల నుంచి రాకేష్ కుమార్ ను విచారణ నిర్వహించకుండా తప్పించాలని అఫిడవిట్లు దాఖలు చేసింది. రెండు కేసుల్లో ఇప్పటికే రాకేష్ కుమార్ విచారణ వద్దని, ప్రభుత్వం అఫిడవిట్లు వేయడంతోపాటు దీనిపైన వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ న్యాయవాదులు సిద్ధమయ్యారు.
** హైకోర్టులో రాకేష్ కుమార్ ను విచారణ నుంచి తప్పించాలని కోరుతున్న సమయంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి రాజ్యాంగ విచ్ఛిన్నం జరగలేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వస్తున్న కొన్ని తీర్పులు ఆశ్చర్యకరంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం ఎక్కడా జరగలేదని ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించడం హైకోర్టు న్యాయమూర్తి అయిన రాకేష్ కుమార్ కు మింగుడు పడలేదు.. ఏ కోర్టు అయినా ఏ న్యాయ వ్యవస్థ అయినా రాజ్యాంగం పరిరక్షణకు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. అందరికీ ఒకటే రూల్ ఒకటే వర్తింపు ఉంటుంది. అలాంటిది రాకేష్ కుమార్ తీరు పట్ల ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించారు అంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.
** రాకేష్ కుమార్ తీరు మీద మొదటి నుంచి జగన్ ప్రభుత్వం గుర్రుగానే ఉంది. ప్రతి విషయం పట్ల రాకేష్ కుమార్ స్పందించే తీరు, ఆయన ఉన్నదానికి లేనిదానికి పత్రికల్లో శీర్షికలు ఎక్కాలని తాపత్రయంతో మాట్లాడే తీరు మీద ప్రభుత్వ న్యాయవాదులు ప్రతిసారి ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం నోటికి ఏది వస్తే అది ప్రభుత్వంపైన విరుచుకుపడడం, ప్రతిపక్ష నాయకులకు సమానంగా ఆయన చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తగిన ఆధారాలు సమర్పిస్తూ అఫిడవిట్లు వేసి రాకేష్ కుమార్ ను విచారణ నుంచి తప్పించాలని కోరింది.

** సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు ఆదేశాలు మేరకు ఓ కేసులో న్యాయమూర్తి ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని భావిస్తే, దానికి తగిన ఆధారాలు అఫిడవిట్ చూపించి ఆ న్యాయమూర్తిని విచారణ నుంచి తప్పించి వేరే న్యాయమూర్తిని వేయాలని అడిగే హక్కు పిటిషన్ దారులకు బాధితులకు ఉంటుంది. దీనినే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటించింది. దీనిలో ఎక్కడ తప్పు లేదు.
** ఈ అఫిడవిట్లు దాఖలు చేసిన దగ్గర్నుంచి రాకేష్ కుమార్ తీరు మరో రకంగా మారింది. మధ్యలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు ఆయనను మరింత ఇరుకున పెట్టడం తో ఆయన కొత్తకొత్త వ్యాఖ్యలు చేస్తూ న్యాయవ్యవస్థ మీద తనకు అపార నమ్మకం ఉందని, న్యాయ వ్యవస్థ ను తానే కాపడుతున్నట్లు మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపిస్తోంది. దానికి తెదేపా అనుకూల మీడియా పెద్ద పెద్ద శీర్షికల్లో వేయడం రోజువారి దాన్ని బంబాట్ చేయడం అలవాటుగా మారింది. అయితే న్యాయ నిపుణులు మాత్రం రాకేష్ కుమార్ ఏదో చెప్పాలని తాపత్రయ పడుతున్నారు అని, ఈ నెల చివర్లో పదవీ విరమణ చేయనున్న ఆయన నేరుగా తెదేపా కార్యాలయానికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన ఆశ్చర్యంలేదని వ్యాఖ్యానిస్తున్నారు…

author avatar
Comrade CHE

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju