NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజ‌కీయాలు

దిశ చట్టం ఏమైంది ముఖ్యమంత్రి సారు!!

 

 

**దిశా ఘటన జరగడానికి అత్యంత వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డారు.. రోజుకో ప్రేమోన్మాదం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాన్ని కట్టడి చేయడంలో ఎక్కడున్నావ్ లక్ష్యం ఎక్కడో అవాంతరం చోటుచేసుకుంటుంది. ఇది మొత్తంగా జగన్ ప్రభుత్వానికి మచ్చ. దిశా ఘటన జరిగిన వెంటనే అసెంబ్లీలో స్పందించిన ముఖ్యమంత్రి జగన్ దీనిపై ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నట్లు చెప్పడం అంతే వేగంగా చట్టం తీసుకురావడానికి దిశ పోలీస్ స్టేషన్ లు ఏర్పాటుకు ఆయన ముందుకు రావడం అందరూ అభినందించారు.. ప్రతి జిల్లా కేంద్రంలో దిశ పోలీస్ స్టేషన్ కు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో నేరాలు ఆగడం మాత్రం లేదు. ముఖ్యంగా యువతులు మహిళలపై ప్రేమోన్మాదులు ఇష్టానుసారం దాడులు చేయడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. 21 రోజుల్లో నిందితులకు శిక్షలు వేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ దిశ చట్టం అమలు విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపిస్తున్నారు అన్నది పెద్ద ప్రశ్న. ఆదరాబాదరాగా చట్టం చేసి దాన్ని కేంద్రం కోర్టులోకి నెట్టేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దాన్ని ఎలాగోలా మళ్లీ బయటకు తీసి పటిష్ఠంగా అమలు చేసే ప్రయత్నం లోపం ఎక్కడో కనిపిస్తోంది. దీని ఫలితంగానే దిశా చట్టం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.


** దిశ చట్టంలో కొన్ని మార్పులు, నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని కేంద్రం హోంశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్టం చేసినప్పుడే దాన్ని లీగల్గా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆమోదిస్తే ఇలాంటి అడ్డంకులు వచ్చేవి కావు. అయితే అప్పటికప్పుడు దిశా చట్టాన్ని డ్రాఫ్ట్ రూపంలో ఆమోదించడంతో దాన్ని కేంద్రం అడ్డుకుంది.
** దిశ చట్టం అమలు కాకపోయినా దిశ ఘటన జరిగి సంవత్సరం అవుతున్నా దిశ పోలీస్ స్టేషన్ కు సిబ్బందికి ఖర్చు పెట్టిన మొత్తం కోట్లలోనే ఉంది. ఇటీవలే సిబ్బందికి వాహనాలు నిమిత్తం సుమారు 150 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఇక సిబ్బందికి ప్రత్యేక పోలీస్ స్టేషన్లో నిర్వహణ నిమిత్తం అంతే మొత్తం అయింది.
** ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశా కోసం ఎంత ఖర్చు పెడుతున్నా ఫలితం మాత్రం శూన్యం. ఆంధ్రప్రదేశ్లో గత రెండు నెలలుగా సుమారు ఎనిమిది వరకు యువతులపై అత్యాచారాలు హత్యలు జరిగాయి. ఈ ఎనిమిది సంచలనం సృష్టించిన సంఘటనలు. ఇక మొత్తం చూస్తే గత రెండు నెలలుగా 300 పైగా సంఘటనలు యువతులపై జరిగాయి.
** దిశ చట్టం అమలు ఆలస్యమయ్యే కొద్దీ ప్రభుత్వానికి చెడ్డపేరు తప్పదు. ఒక్కో ఈ సంఘటన జరిగే కొద్దీ ప్రభుత్వానికి మచ్చ తప్పదు. చట్టాన్ని చేసిన వారు అమలులో ఏం చేశారని ప్రతిపక్షాలతో పాటు ప్రజల నుంచి కూడా గట్టి వాయిస్ వస్తుంది. ముఖ్యమంత్రి జగన్ దీని మీద దృష్టిపెట్టి కేంద్రంతో మాట్లాడి వారు చెబుతున్న అభ్యంతరాలు పరిష్కరించి చట్టాన్ని అమలులోకి తీసుకు వస్తే ఆయనకు మంచి పేరు రావడం ఖాయం. అలా కాకుండా సంఘటన జరిగినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు దిశా చట్టం పేరు చెబితే ప్రభుత్వానికి మాయని మచ్చ గానే మిగిలిపోతుంది.

author avatar
Comrade CHE

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju