రాయపాటి కోడలిని ఎక్కడ ఎలా ఇన్ వాల్వ్‌ చేశారబ్బా?!!

Share

విజ‌య‌వాడలో రమేష్ హాస్పిటల్స్ కోవిడ్ ప్ర‌మాదం గురించి తెలిసిన సంగ‌తే. స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్-19 సెంటర్ ఏర్పాటు చేయ‌డం, అనంత‌రం జరిగిన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 18 మంది గాయపడటం తెలిసిన సంగ‌తే.

ఈ ఘ‌ట‌న‌లో పోలీసుల ద‌ర్యాప్తు కొన‌సాగుతుండ‌గా ప్రస్తుతం రమేశ్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఈ ఘ‌ట‌న‌లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు, గుంటూరు రమేష్ ఆసుపత్రి మేనేజ్మెంట్ మెంబర్ అయిన డాక్టర్ మమత విజయవాడ పోలీసుల విచారణ చేప‌ట్టారు.

గుంటూరు రమేష్ హాస్పిటల్స్  ఘ‌ట‌న‌లో ప‌లువురిని విచారిస్తున్నారు. ఈ క్ర‌మంలో రమేష్ ఆసుపత్రి మేనేజ్మెంట్ మెంబర్ అయిన డాక్టర్ మమతను ఆరు గంటలు పాటు విచారించారు. ఈ విచారణ అనంతరం డాక్టర్ మమత మాట్లాడుతూ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన అంశాలు మాత్రమే తాను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ హాస్పిటల్ తనకి ఎటువంటి సంబంధం లేదని, కేవలం విజయవాడ పోలీసులు నోటీస్ ఇవ్వడం వల్ల విచారణకు హాజరయినట్లు వెల్లడించారు. తనపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని డాక్ట‌ర్ మ‌మ‌త‌ వివ‌రించారు.

ఇదిలాఉండ‌గా, డాక్ట‌ర్ మ‌మ‌త‌కు సంబంధించిన న్యాయ‌వాది ఉమాశంకర్ మాట్లాడుతూ సంబంధం లేని వ్యక్తిని ఈ విషయంలో పదే పదే ఇబంది పెట్టడం తగదని ఆయన అన్నారు. కరోనా నుంచి కలుకుంటున్నడాక్టర్ మమతను  దాదాపు 7గంటలు విచారించడం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. పూర్తిగా కోలుకోని ఆమె ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో పోలీస్ వారికీ అంత కంటే ఇంకా ఎక్కువ ప్రమాదమని అన్నారు. ముందస్తు పరిస్థితులు స్థితి గతులు అధ్యయనం చేయకుండా జిల్లా కలెక్టర్, మున్సిపల్, ఫైర్, డీఎంహెచ్ఓలు ఎలా  అనుమతిస్తారు?? అని ఆయన ప్రశ్నించారు. హాస్పిటల్, హోటల్ యాజమాన్యాలను నిందించే  ముందు ఈ తప్పు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్,  ఫైర్ శాఖలది కూడా అని అన్నారు. పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నవారిని ఇలా ఇబంది పెట్టకూడదని ఆయన అన్నారు.


Share

Related posts

జస్టిస్ రమణపై సుప్రీమ్ లో పిల్… కానీ వైసీపీ చేసిన తప్పు ఏమిటంటే..!?

Muraliak

పవన్ మాట వినేదెవరు?  రాజీనామాకు స్పందించేదెవరు?

sekhar

నమ్మకు అచ్చెన్నా.. అంటూ చంద్రబాబు విషయంలో అచ్చెన్నకు సన్నిహితుల సలహాలు

Varun G