NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ జనసేనల హానీమూన్ ముగిసినట్లేనా?

బీజేపీ జనసేనల మధ్య క్రమంగా దూరం బాగా పెరిగిపోతోందని రాజకీయ వర్గాల టాక్.ఏపీలో పార్టీ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించిన బీజేపీ ఈ కార్యక్రమానికి జనసేనాని పవన్ కల్యాణ్ ను ఆహ్వానించపోవటం ఇక్కడ గమనార్హం.అలాగే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారానికి వెళ్లకపోవడం అక్కడి జనసైనికులకు కనీసం బిజెపికి మద్దతు ఇవ్వమని ఆయన చెప్పకపోవడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 2014 ఎన్నికల్లో బిజెపి టిడిపి కూటమికి మద్దతిచ్చిన జనసేన 2019 లో మాత్రం కమ్యూనిస్టులు బీఎస్పీ మద్దతుతో పోటీకి దిగింది. కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది.కాలక్రమంలో కమ్యూనిస్టులకు దూరమై కమలనాథుల చెంతకు జనసేనాని చేరారు.

Whether the BJP Janasena honeymoon is over
Whether the BJP Janasena honeymoon is over

పొత్తుపొడిచిన కొత్తలో.. రాష్ట్రంలో ఏ కార్యక్రమమైనా ఇరు పార్టీలు కలసే చేసేవి. నిన్న మొన్నటి అంతర్వేది ఆందోళనల్లో కూడా జనసేన, బీజేపీ జెండాలు కలిసే ఎగిరాయి. ఇప్పుడు ఇద్దరి మధ్య వ్యవహారం బెడిసికొట్టిందనే సంకేతాలు వెలువడుతున్నాయి.దీనికి ప్రధాన కారణం వైసిపిని బిజెపి దగ్గరకు తీస్తుండటం అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఈ మధ్య కాలంలో వైసీపీ బీజేపీకి బాగా చేరువైంది నేరుగా ప్రధాని మోడీ ఆయనకు అత్యంత సన్నిహితుడైన అమిత్ షాలతో ముఖ్యమంత్రి జగన్ టచ్ లో ఉన్నారు.వారు కూడా జగన్కు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తూ స్నేహంగా మెలుగుతున్నారు.వ్యవసాయ బిల్లుకు వైసిపి మద్దతివ్వటం బీజేపీ అగ్రనాయకత్వానికి అమితంగా నచ్చింది.ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ తనదైన పంథాలో వ్యవహారం నడుపుతోంది. ఇది జనసేనకు ఏమాత్రం నచ్చడం లేదు.ఈ కారణంగానే జగన్ అంటే జలసీతో రగిలిపోయే పవన్ పార్టీకి బీజేపీకి మధ్యగ్యాప్ పెరిగిపోయిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు

Whether the BJP Janasena honeymoon is over
Whether the BJP Janasena honeymoon is over

ఇటీవల కాలంలో ప్రధాని మోదీ ప్రసంగాలేవీ జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి కానీ, పవన్ పర్సనల్ అకౌంట్ నుంచి కానీ షేర్ కాలేదు. పవన్ కల్యాణ్ కూడా కేంద్రం నిర్ణయాలను ప్రశంసించిన దాఖలాలు కూడా లేవు. వీటన్నిటి చూస్తుంటే బిజెపితో జనసేన హానీమూన్ ముగిసినట్లేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు.ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు కదా పవన్ కల్యాణ్ అందుకే వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు అంటున్నారు.ఇప్పటికైతే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్న ఈ రెండు పార్టీల పోకడలు భవిష్యత్తులో ఏ విధంగా మారతాయి అన్నది చూడాలి.

author avatar
Yandamuri

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju