ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి పది లక్షల మంది కి పైగా చనిపోయారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఒక్క అమెరికాలోనే రెండు లక్షల మరణాలు సంభవించాయి. తాజాగా కరోనా భారిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పడటం జరిగింది. అయితే తాజాగా ట్రంప్ కి కరోనా వచ్చిన విషయాన్ని వైట్హౌస్ ఒకరోజు ఆలస్యంగా ప్రకటించింది. డోనాల్డ్ ట్రంప్ హాస్పటల్లో జాయిన్ చేసిన కూడా పరిపాలన వ్యవహారాలని ఆయనే చక్క పెడుతున్నట్లు చెప్పుకొచ్చింది.
నిజంగా ట్రంపు ఆరోగ్యంగా ఉంటే మిలిటరీ హాస్పిటల్ లో ఎందుకు జాయిన్ చేశారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైట్ హౌస్ లోనే హోమ్ ఐసోలేషన్ పార్టీ ఇస్తే సరిపోతుంది కదా వ్యక్తమవుతున్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఒక ట్రంపు విషయంలో మాత్రమే కాక గతంలో అనేక మంచి అధ్యక్షుల విషయంలో వైట్హౌస్ ఈ విధంగానే వ్యవహరించింది. వాస్తవాలను దాచిపెట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పింది. అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఆరోగ్య సమస్య చిన్నదైనా, పెద్దదైనా. అమెరికా వైట్ హౌస్ ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా వ్యవహరించింది. ఇప్పుడు కరోనా లాగానే 1914 లో స్పానిష్ ఫ్లూ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది.
ఇప్పుడు కరోనా ని డోనాల్డ్ ట్రంప్ తక్కువచేసి చూసినట్టే అప్పట్లో వుడ్రో విల్సన్ అధ్యక్షుడు స్పానిష్ ఫ్లూ నీ చాలా లైట్ గా తీసుకున్నారు. దీంతో విల్సన్ కు స్పానిష్ ఫ్లూ సోకింది. తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అప్పట్లో కూడా వైట్హౌస్ విల్సన్ ఆరోగ్య పరిస్థితి గురించి గోప్యంగా వ్యవహరించింది. 1919లో మొదటి ప్రపంచం యుద్ద ముగిసిన సందర్భంగా ప్యారిస్ లో చర్చలు జరుపుతున్న సమయంలో విల్సన్ తీవ్ర అనారోగ్య కారణంగా కుప్పకూలిపోయారు.
విషప్రయోగం జరిగిందేమో అని విల్సన్ వ్యక్తిగత వైద్యుడు వైట్ హౌస్ కి ఓ లెటర్ రాశారు. కానీ విల్సన్ స్పానిష్ ఫ్లూ బారిన పడ్డారని తర్వాత తెలిసింది. ఇప్పుడు సరిగ్గా వంద సంవత్సరాల తర్వాత ఇటువంటి సంఘటనలు పునరావృతం అయింది. చాలా సందర్భాలలో శ్వేతసౌధం అమెరికా అధ్యక్షుల ఆరోగ్యం గురించి చాలా సీక్రెట్ వ్యవహరించింది. ఏది ఏమైనా అమెరికా అధ్యక్ష ఆరోగ్య పరిస్థితి విషయంలో వైట్ హౌస్ ప్రజలకు అసలు విషయాలు తెలియ చేయకుండా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు గతంలో నుండి వ్యక్తమవుతూనే ఉన్నాయి.