రథ సారథి ఎవరు? బీజేపీ లో అంతర్మథనం!

లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన రథయాత్ర బిజెపి కు అతిపెద్ద బలం. ఒక రకంగా చెప్పాలంటే 1990ల్లో బిజెపి అత్యంత బలంగా బలపడడానికి ఆ రథయాత్ర వందకు వందశాతం ఉపయోగపడింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం నిమిత్తం చేపట్టిన యాత్రకు ప్రతి గ్రామం నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. భారత యాత్ర తర్వాత పలువురు నాయకులు రథయాత్రలు చేపట్టిన బిజెపికి అది ఏమాత్రం ఉపయోగపడలేదు…

అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి నాయకులు సైతం రథ యాత్రకు సై అంటున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి తిరుపతిలోని కపిలతీర్థం సాక్షిగా ఈ యాత్రను మొదలు పెట్టేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ యాత్ర ఇటీవల వివాదాస్పదమైన రామతీర్థం దగ్గర పెద్ద బహిరంగ సభతో ముగుస్తుంది. ప్రారంభాన్ని ముగింపును సైతం కీలకమైన తిరుపతి ఉప ఎన్నిక కు తర్వాత వివాదాస్పదమైన రామ తీర్థానికి ముడిపెడుతూ బిజెపి మొత్తం దీని రూట్ మ్యాప్ ను సిద్ధం చేసే పనిలో ఉంది. దీనికి ఇప్పటికే ఢిల్లీ పెద్దల నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వారు సైతం ప్రస్తుత రాష్ట్ర పరిస్థితుల్లో ఈ ఆలయాల మీద దాడులు సందర్భంగా యాత్ర బాగుంటుందని.. తిరుపతి ఉప ఎన్నికకు దీనిని ముడిపెడుతూ మొదలు పెడితే మరింత బలం చేకూరుతుందని సూచించిననట్లు తెలిసింది.. అయితే దీన్ని ఎవరు ప్రారంభిస్తారు ఎవరు ముగిస్తారు అన్న విషయంలోనే సందిగ్ధత నెలకొంది. జాతీయ నాయకులు ఎవరైనా ఈ యాత్రను మొదలు పెట్టేందుకు… తిరుపతిలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బిజెపి ఆలోచిస్తోంది. అదే ఊపులో తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టవచ్చు అని… జాతీయ నాయకుల్లో ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రథయాత్ర ప్రారంభానికి తీసుకొస్తే అది తిరుపతి ఉప ఎన్నికలకు ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర బిజెపి నాయకులు భావిస్తున్నారు.

మొత్తానికి సారథ్యం వహించేదేవరు?

పాదయాత్ర విషయంలో బిజెపి మల్లగుల్లాలు పడుతోంది. దీనిని ప్రకటిస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పినప్పటికీ దీనికి సారథ్యం వహించేది ఎవరు అన్న విషయంలోనే వారికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రథయాత్ర అంటే ప్రతి నియోజకవర్గంలో రథయాత్ర వెళ్లే ప్రతి చోటా జనాన్ని బట్టి ప్రసంగించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆయా ప్రాంతాలను కలిపే విషయాలను మాట్లాడాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో అంతటి ప్రసంగ కర్త గాని, జనాన్ని పోగు చేసే అంత క్రౌడ్ పుల్లర్ గాని పార్టీలో లేరు. దీంతో అసలు ఈ రథం ఎవరు వహిస్తారు అన్నదాని మీదే ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఒకవేళ అది సరిగా సాగదు పోతే మొదటికే మోసం వస్తుందని బీజేపీ రాష్ట్రంలో బలపడుతుంది అనుకున్న సమయంలో ఏ మాత్రం తేడా వచ్చినా సరే మొదటికే మోసం వస్తుందని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.

అసలు చర్చించార?

సోము వీర్రాజు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు విషయాలపై తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకుంటున్నారు అని పార్టీ నాయకుల్లో విమర్శ ఉంది. ప్రస్తుత రథయాత్ర విషయాన్ని సైతం సోము వీర్రాజు అలాగే ప్రకటించారని పార్టీలో ఎవరితో మాట్లాడకుండానే ఈ యాత్రలో ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. కీలకమైన కేంద్ర పార్టీ అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరు మాత్రం ఇప్పుడు పలు అంశాలకు దారితీస్తోంది. సోము వీర్రాజు అంత వన్ మ్యాన్ షో చేస్తున్నాడని ఎవరినీ కనీసం సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ జిల్లా నాయకులకు సైతం సోము వీర్రాజు చెప్పిందే వేదంగా జరుగుతోందని ఇప్పుడు పార్టీలో విమర్శ.

** రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం కనిపించని కుమ్ములాటలు అన్న పరిస్థితి ఉంది. పార్టీలోకి ఇటీవల వచ్చిన వారి సూచనలు సలహాలు ఏమాత్రం పట్టించుకోకుండా నే రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళుతుందని ఇది ఏ మాత్రం సరికాదనేది పార్టీ నేతల మాట. దీనిపై వెంటనే జాతీయ నాయకత్వం ముందుకు ధరించకపోతే రాష్ట్ర బీజేపీలో ముసలం పుట్టే అవకాశం కూడా ఉందని పార్టీ ని పరిశీలిస్తున్న వారు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం రథయాత్ర చేస్తామని సోము వీర్రాజు ప్రకటించిన తర్వాత దానిని ఎవరు ఎలా నిర్వర్తిస్తారు అనే దాని మీద ప్రస్తుతం పార్టీలోనే ఘనమైన చర్చ జరగడం, ఈ యాత్ర సాక్షిగానే పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బయటకు వచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ నాయకులే చెప్పడం విశేషం.