NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ మాట వినేదెవరు?  రాజీనామాకు స్పందించేదెవరు?

ఏపీలో మూడు రాజధానులు నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర లభించడంతో ఏపీ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మూడు రాజధానులు నిర్ణయం వల్ల వెనుకబడిపోయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందుతాయని ఆ ప్రాంత ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. 

Who listens to Pawan? Who will respond to the resignation?
Who listens to Pawan Who will respond to the resignation

ఇటువంటి తరుణంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు పై ఇటీవల పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ మాట్లాడుతూ రాజధాని ప్రాంత ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి పై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలో కి రావాలని రాజధాని ప్రాంతం పరిధిలో ఉన్న రెండు పార్టీల ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. 

మూడు రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు విమర్శించారు. రైతు కన్నీరు పై రాజధాని నిర్మాణం రాష్ట్రానికి అరిష్టం అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు. రాజధాని వికేంద్రీకరణ పై న్యాయనిపుణులతో చర్చిస్తామని పవన్ తెలిపారు.  ఇదిలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో ఎంపీలంతా రాజీనామా చేస్తే దెబ్బకు కేంద్రం దిగి వస్తుంది, మీతో పాటు నేను పోరాడతానని పిలుపునిచ్చారు.

ఆ సమయంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే టీడీపీ ఎంపీలు పెద్దగా పట్టించుకోలేదు. పవన్ చెప్పాడు కాబట్టి రాజీనామా చేశామని నాడు వైసీపీ ఎంపీలు కూడా చెప్పారు. కాగా ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో పవన్ మాట టీడీపీ ఎమ్మెల్యేలు వింటారా…?, అసలు వైసీపీ నాయకులు పవన్ కు ఎలాంటి కౌంటర్లు ఇస్తారు…? కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ మాట వినేదెవరు ? రాజీనామాకు స్పందించేది ఎవరు అన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సస్పెన్స్ గా మారింది.

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju