NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

రెబల్ ఎంపీ రాజీనామా చేస్తే..! గెలుపెవరిది..? (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం)

వైసీపీపై ఒంటికాలితో లేస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు..!! పార్టీకి రెబల్ గా మారిన ఆయన రోజుకో విషయంతో పార్టీని ఆడిపోసుకుంటున్నారు..! ఎక్కడ ఏ చిన్న టాపిక్ దొరికినా ఢిల్లీ స్థాయిలో మాట్లాడుతూ దాన్ని వైసీపీకి వ్యతిరేకంగా రుద్దేస్తున్నారు..! గతంలో రాజీనామా అంటే వెనకడుగు వేసి ఆయన ఇటీవల
రాజీనామాకు కూడా సిద్ధమే అంటున్నారు. రాజీనామా చేసి లక్ష ఓట్లతో గెలుస్తా అంటున్నారు. అందులో లాజిక్కు ఎంత..? ఆయన గెలుపు వ్యూహం ఏంటి..? ఎవరి అవకాశాలు ఏంటి..? అనేది ఈ విశ్లేషణ ద్వారా చూద్దాం..!!

who will win if rrr will resign
who will win if rrr will resign

సాదా సీదా ఎంపీ కాదు సుమీ..!!

రాజుగారి రాజకీయం మొదలయింది కాంగ్రెస్ లో.., ఎక్కువ కాలం కొనసాగింది బీజేపీలో, చుట్టంగా ఉన్నదీ టీడీపీలో.., పోటీ చేసి గెలిచింది వైసీపీలో..!! అంటే ఆయన నాలుగు పార్టీలను చుట్టేశారు. కానీ వైసీపీ తప్ప ఏ పార్టీతోనూ వైరం పెట్టుకోలేదు. ఇప్పటికీ ఆయన తన పాత మిత్రులు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పెద్దలతో సన్నిహితంగానే ఉంటారు. కేవలం రాజుగారికి జగన్ విషయంలోనే వైరి ఏర్పడింది. ఓ అంతర్గత విషయంలో ఇద్దరి మధ్య దూరం పెరిగి, రాజుగారి ఈగో హర్ట్ అయ్యి.., ముందుగా ఆ జిల్లా ఎమ్మెల్యేలతోనూ.., తర్వాత పార్టీతోనూ తెగదెంపుల వరకు వెళ్ళింది. అందుకే తాడోపేడో తేల్చుకుండేందుకు సిద్ధమయ్యారు. అయితే అందరిలా ఆయన సాదా సీదా ఎంపీ మాత్రం కాదు. ఢిల్లీ స్థాయిలో వ్యాపార సామ్రాజ్యం ఉంది. దశాబ్దంన్నర నుండి అక్కడి పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆ ధీమా, ఈ తెగింపు.

గెలుపునకు వ్యూహాలు వేసుకుని..!!

ఇక ఆయన రాజీనామా చేస్తే గెలుస్తారా.? లేదా అనేది పెద్ద ప్రశ్న..! నిజానికి రాజు తన రాజకీయా జీవితాన్ని రిస్కుతో పెట్టి వైసీపీతో వైరం పెంచుకుంటున్నారు. ఆయనకు బీజేపీ, టీడీపీ మద్దతు ఉందా, లేదా అనేది పక్కన పెడితే..!, ఆయన పోటీ చేయాలంటే మాత్రం ఈ రెండు పార్టీలు ఆయనకు అండగా నిలవాలి. ఒకవేళ రాజు రాజీనామా చేసినా, అనర్హత వేటు పడినా ఆయన ఉప ఎన్నికకు సిద్ధమవుతారు. గెలుపునకు ఆయన నమ్ముకున్నది కేవలం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలనే. బీజేపీలో చేరి, పెద్దలను ఒప్పించి పోటీకి దిగాలన్నది వ్యూహం కావచ్చు. అయితే క్షేత్రస్థాయిలో వైసీపీ బలంగా ఉంది. ఆ పార్టీని తట్టుకుని నిలబడాలి అంటే టీడీపీ ఒక అభ్యర్థిని, తాను బీజేపీ తరపున నిలబెడితే ముక్కోణపోటీలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలి తన ఓటమి ఖాయం. వైసీపీ గెలుపు ఖ్యాయం. అందుకే వైసీపీ అభ్యర్థి ఎవరైనా సరే… ఇటు నుండి తాను ఒక్కడినే నిలబడాలి అనేది రాజుగారి వ్యూహం. టీడీపీని ఒప్పించి తనకు మద్దతు తీసుకుని.., బీజేపీ, జనసేన మద్దతుతో గెలవాలి అనేది ఒక ప్లాన్.

వర్కవుట్ అయ్యే అవకాశాలు..!?

రాజుగారి ప్లాన్ బాగానే ఉంది. అది ఎంత వరకు వర్కవుట్ అవుతుంది అనేది చూసుకుంటే..!! నరసాపురం పార్లమెంటు పరిధిలో రాజులు, కాపు ఓట్లు ఎక్కువ. బీసీలు, ఎస్సైలు ఉన్నప్పటికీ గ్రామాల్లో రాజులూ, కాపులు చెప్పినట్టుగా నడుచుకుంటారు. రాజుగారికి రాజుల మద్దతు బాగానే ఉంది. వైసీపీలో మంత్రిగా ఉన్న శ్రీరంగనాధరాజు పై స్థానికంగా ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సైలెన్స్.., వలన రాజుల ఓట్లు తనకు ఆశించిన మేరకు వస్తాయని నమ్ముతున్నారు. ఇక కాపుల ఓట్లు చాలా వరకు జనసేన,టీడీపీ పట్టుకుని ఉంచుకున్నాయి. అందుకే ఈ రెండు పార్టీల చలవతో కాపుల ఓట్లు తెచ్చుకుంటే గెలవచ్చు అనేది ఆయన వ్యూహం. అంటే వైసీపీ తరపున ఎవరు నిలబడినా.. తాను మాత్రం టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా నిలబడాలి అనేది ఆయన వ్యూహం అని చెప్పుకుంటున్నారు.

టీడీపీ అంగీకరిస్తుందా..?

బీజేపీకి టీడీపీకి పడడం లేదు. బీజేపీ ప్రధాన ప్రత్యర్థి టీడీపీ. అటువంటి సమయంలో నరసాపురంలో రాజుగారు బీజేపీ తరపున నిలబడితే టీడీపీ అంగీకరిస్తుందా అనేది పెద్ద ప్రశ్న. ఒప్పుకోకపోతే ఓటమి తప్పదు. వైసీపీకి ఆ సీటు బహుమానం అవుతుంది. అలా కాకుండా రాజు గారు గట్టిగా, నమ్మకంగా ఉన్నారు కాబట్టి మద్దతు ఇస్తే వైసిపిని ఓడించవచ్చు అనేది టీడీపీ వ్యూహం. అయితే రాజు బీజేపీ తరపున కాకుండా ఇండిపెండెంట్ గా నిలబడి అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకోవాలి అనేది టీడీపీ జిల్లా నేతల మాట. బీజేపీ గుర్తుతో పోటీ చేస్తే.., టీడీపీ మద్దతు విషయంలో ఆలోచిస్తుంది.., అదే వైసిపికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచి, బీజేపీలో చేరితే బాగుంటుంది అని కొందరు నేతలు పేర్కొంటున్నారు.

గెలుపు ఎంత వరకు సాధ్యం..!?

ఇక రాజుగారు అనుకున్నట్టే బీజేపీ, టీడీపీ, జనసేన మద్దతుతో పోటీలోకి దిగుతారు అనుకుందాం. ఇటు వైసీపీ తరపున మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబం నుండి పోటీలోకి దిగే అవకాశం ఉంది. అంటే ఇద్దరూ రాజులే. ఓట్లు చీలిక ఖాయం. నరసాపురం పార్లమెంటు పరిధిలోని మూడు నియోజకవర్గాల్లోటీడీపీ బలంగా ఉంది. నాలుగు చోట్ల వైసీపీ బలంగా ఉంది. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన కలిస్తే మాత్రం వైసిపికి గట్టి పోటీ ఉంటుంది. ఎన్నికల ప్రణాళికలు కచ్చితంగా అమలు చేస్తే గెలుపు కూడా దక్కవచ్చు. గెలుపు అంశాన్ని పక్కన పెడితే పోరు మాత్రం పందెం పుంజుల్లాగా.., మాంచి రసపట్టులో ఉంటుంది.

author avatar
Srinivas Manem

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju