NewsOrbit
రాజ‌కీయాలు

కమల్, కమలం..! రెండింటిలో రజనీ ఎవరి వైపు..!? కీలక విశ్లేషణ..!!

whose side is rajinikanth on

దేశంలో అన్ని రాష్ట్రాల ఎన్నికల తీరు వేరు.. ఒక్క తమిళనాడు రాష్ట్ర ఎన్నికల తీరు వేరు. దశాబ్దాలుగా తమిళ రాజకీయాల్లో ద్రవిడ పార్టీలదే ఆధిపత్యం. శతాబ్దం చరిత్ర ఉన్న కాంగ్రెస్ కూడా తమిళనాడులో అడుగుపెట్టలేక పోయింది. కొన్ని దశాబ్దాలుగా డీఎంకే లేదంటే అన్నాడీఎంకే. ఈ రెండు పార్టీలే ప్రతి అయిదేళ్లకు ఓసారి అధికారం పంచుకుంటాయి. 2016లో మాత్రమే అన్నాడీఎంకే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. భాషకు అధిక ప్రాధాన్యం ఇచ్చే తమిళనాడు ప్రజలు ద్రవిడ పార్టీలకే జై కడతారు. సినిమాల ప్రభావం కూడా రాజకీయాలపై తీవ్రంగా ఉంటుంది అక్కడ. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత.. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి సీఎంలు అయ్యారు. ఈసారి కరుణానిధి లేకుండా స్టాలిన్, జయలలిత లేకుండా శశికళ, కమల్ హాసన్.. తోపాటు జాతీయ పార్టీ బీజేపీతో కొత్త రాజకీయానికి తమిళనాడు సిద్ధమవుతోంది.

whose side is rajinikanth on
whose side is rajinikanth on

బీజేపీ పాచికలు పారతాయా..?

రెండు దశాబ్దాలుగా బాగా ఉనికిలో ఉన్న బీజేపీ ఇప్పుడు దేశ రాజకీయాల్ని శాసిస్తోంది. ఉత్తరాదిన పట్టు సాధించిన బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక మినహా మరెక్కడా కాలు పెట్టలేకపోతోంది. త్వరలో జరగబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన బలం చూపాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ.. తమిళనాడు సంగతి బీజేపీకి ఇంకా పూర్తిగా అర్ధం కానట్టుంది. అక్కడి పార్టీలు, నాయకులే కాదు.. ప్రజలందరిదీ ఒకటే మాట. ‘మాలో మేము పోట్లాడుకుంటాం కానీ.. బయట నుంచి మా మధ్యలోకి ఎవరైనా వస్తే సహించేది లేదు’ అనే టైపు. అన్ని రాష్ట్రాల్లో తన పదునైన వ్యూహాలతో ముందుకెళ్లే బీజేపీ తమిళనాడులో ఇప్పుడే సొంతంగా వెళ్లలేమని తెలుసనే చెప్పాలి. అందుకే.. జయలలిత మరణం తర్వాత చాకచక్యంగా అన్నాడీఎంకేకు సాయం చేసింది. అన్నాడీఎంకే వెనుక శశికళ ఉన్నా.. వివాదాలమయమే. అందుకే అన్నాడీఎంకేను సపోర్ట్ చేసి ముందుకెళ్లే పరిస్థితులే కనిపిస్తున్నాయి.

కమల్ హాసన్ సినీ నేపథ్యం పనికొస్తుందా..?

కొత్తగా కమల్ హాసన్ పార్టీ పెట్టి తమిళ రాజకీయ రణక్షేత్రంలోకి దిగుతున్నారు. కమల్ హాసన్ సినీ గ్లామర్ ఏమంత ఎఫెక్టివ్ కాదని గత ఏడాది ఎంపీ ఎలక్షన్స్ లో తేలిపోయింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికలు వేరు.. అప్పుడు చూపిస్తాం మా తడాఖా అంటున్నారు పార్టీ నేతలు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాదు.. తమిళ ప్రజల నాడిని పట్టి ముందుకు వెళ్తున్నారు కమల్. బీజేపీకి అవకాశం లేకుండా కేంద్రం నిర్ణయాలను తప్పుబడుతూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ‘మధురై’ రెండో రాజధాని అంశాన్ని సెంటిమెంట్ గా వాడుకుంటున్నారు. ద్రవిడ పార్టీలపై ఇప్పటికైతే విమర్శలు చేయడం లేదు కానీ.. త్వరలో పూర్తిస్థాయి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన మొదలుపెట్టేశారు. అయితే.. కమల్ నాయకత్వంలపై ప్రజలకు అంతగా విశ్వసిస్తారా..? అనేది అనుమానమే. ఒంటెద్దుపోకడలు, నాయకులకు వాక్ స్వాతంత్రం ఉండదని ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. రజినీకాంత్ కూడా పోటీలో లేకపోవడం కమల్ కు కాస్త ఉపశమనం ఇచ్చేదే అయినా.. పూర్తిగా లాభిస్తుందని చెప్పలేం. సినిమా వారి రాజకీయాలకు తమిళనాడులో ప్రస్తుతం స్థానం లేదని రజినీకాంత్ తాను చేయించిన సర్వేలో తేలిందని.. అందుకే వ్యూహాత్మకంగా రాజకీయ పార్టీ పెట్డడం లేదని ప్రకటించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో కమల్ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.

రజినీ శాసించగలరా..?

స్థానికతకే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే తమిళనాడులో ఒక్క రజినీకాంత్ విషయంలోనే ఆ నియమం పక్కకు వెళ్లిపోయింది. ఇటివలే ఆరోగ్యం సహకరించడం లేదంటూ రాజకీయాల్లో వెనకడుగు వేశారు. అయితే.. రజినీ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే ప్రశ్న ఉంది. బీజేపీతో దోస్తీ ఉంది. కేంద్రం నిర్ణయాలను సమర్ధిస్తున్నారు కూడా. దీంతో రజినీ బీజేపీకి సపోర్ట్ చేస్తారని అంటున్నారు. కానీ.. పెద్దగా బలం లేని బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని తమిళనాడులో అధికారంలో కూర్చబెట్టే అవకాశం లేదు. ఇది రజినీకి కూడా తెలుసు. ఓదశలో జయలలితకు ఓటు వేయాలని రజినీ గతంలో పిలుపిచ్చారు. పర్యటించారు కూడా. కానీ.. ఆయన పర్యటించిన చోట జయలలిత పార్టీ ఓడిపోయింది. పార్టీ కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో రజినీ సినిమా మ్యాజిక్ రాజకీయాల్లో పనిచేస్తుందని చెప్పడానికి కూడా లేదు. ఏమైతేనేం.. తమిళనాడు రాజకీయాల్లో ఉద్దండులు లేని కొత్త రాజకీయాలకు తెర లేవబోతోందని చెప్పాలి.

author avatar
Muraliak

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju