జీవీల్ ఏమిటో..! ఇలా దొరికారు..!!

కొత్తాగా ఏదన్నా జరిగితే అది అద్భుతం. ఎప్పుడూ జరిగేదే అయితే.. పనిని బట్టి బాధ్యత, పని.. అంటూ విభజిస్తాం. అటువంటి అద్భుతాన్నే ఓ రాజకీయ నేత చేసి ఆశ్చర్యం కలిగించారు. ఆయనే.. రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. తన వాగ్దాటితో నిత్యం వార్తల్లో ఉండే జీవీఎల్ ప్రస్తుతం అధికార ప్రతినిధి కాకపోవడంతో తన మాటల పదును తగ్గింది. అందుకే చేతల్లో తన పనితనం చూపిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా.. ఆయన ఎంపీ హాదాలో గతంలో ఎప్పుడూ వెళ్లని గుంటూరు మిర్చి బోర్డుకు ఈ సోమవారం వెళ్లారు. అక్కడ స్పైసెస్ బోర్డ్ ఆధ్వర్యంలో మిర్చి ఎగుమతిదారులతో సమావేశ నిర్వహించారు. వారి ఇబ్బందులు, పరిష్కార మార్గాలు, విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలపై చర్చించారు.. తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలోనే ఏపీ రాష్ట్ర అగ్రి మార్కెటింగ్ డైరక్టర్, కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న ను కలిశారు. ఇదంతా బాగానే ఉంది. కానీ.. ఇప్పుడే ఎందుకిలా అనే చర్చ మాత్రం జరుగుతోంది.

why bjp mp gvl spotted at guntur
why bjp mp gvl spotted at guntur

గతంలో చేయనిది.. ఇప్పుడే ఎందుకిలా..?

గతంలో జీవీఎల్ ఎప్పుడూ రైతులతో మాట్లాడలేదు. రైతు సమస్యలపై చర్చించిందీ లేదు. కానీ.. అకస్మాత్తుగా ఏకంగా గుంటూరు మర్చి బోర్టుకే వెళ్లారు. అయితే.. ఎంపీ హోదాలో అధికారరిక పర్యటన చేయొచ్చు. కానీ.. ఎంపీ పర్యటన దాదాపు గోప్యంగానే జరిగినట్టు తెలుస్తోంది. మిర్చి బోర్టు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు కూడా ఆయన పర్యటనలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎవరూ లేరు. మరి.. ఇంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్లారంటే సమాధానం దొరకని ప్రశ్నే అవుతోంది. అందుకే.. దీనిన అద్భుతం అనుకోవచ్చు.. గతంలో చేయనిది చేశారు కాబట్టి ఆశ్చర్యం రేకెత్తించారనుకోవచ్చు. వీటన్నింటికీ జీవీఎల్ మాత్రమే సమాధానం చెప్పాల్సింది. మొత్తానికి జీవీఎల్ ఏదో చేయబోతున్నారు. అది.. బీజేపీనే చేయించొచ్చు..!! లోగుట్టు పెరుమాళ్ల కెరుక..!