హైదరాబాదు పేరు చెబితే జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మండిపడుతున్నారు..??

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ పై ఏదో ఒక రీతిలో బురదజల్లడానికి విపక్షాలు అనేక కుయుక్తులు పన్నుతున్న సంగతి తెలిసిందే. భాష విషయంలో అదేవిధంగా కులం విషయంలో తాజాగా ఇప్పుడు మతాలను అడ్డం పెట్టుకుని విపక్షాలు వైసీపీ ని టార్గెట్ చేస్తూ ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి నానా తంటాలు పడుతున్నట్లు పరిశీలికుల మాట. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్ర మంత్రుల పనితీరు విషయంలో నివేదిక తెప్పించుకొని అసహనం చెందినట్లు పార్టీలో టాక్.

Andhra Pradesh CM Jagan Mohan Reddy hails Telangana CM for Hyderabad encounterపూర్తి విషయంలోకి వెళితే రాష్ట్రంలో ఉన్న చాలామంది మంత్రులకు వ్యాపారాలు ఉండటంతో…. పరిపాలనపై దృష్టి పెట్టకుండా ఎక్కువగా వ్యాపారాలకే ఎక్కువ టైం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తేలిందట. అంతేకాకుండా చాలా మంది మంత్రులు రాష్ట్రంలో లేకుండా పదేపదే హైదరాబాద్ కి వెళ్ళటం తాజాగా జగన్ దృష్టికి వచ్చిందట. ఈ విషయంలో జగన్ చాలాసార్లు మంత్రులకు చెప్పినా గాని వాళ్ళలో మార్పు రాకపోవడంతో ఇప్పుడు హైదరాబాద్ పేరు చెబితేనే జగన్ మండిపడే పరిస్థితి వచ్చిందట.

 

అంతేకాకుండా తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారాలు చేసుకోవాలని దానికి తగ్గ రీతిలో ప్రభుత్వం సపోర్ట్ గా ఉంటుందని చెప్పినా మంత్రులు వినకపోవడంతో హైదరాబాద్ కి మంత్రులు అస్తమానం వెళ్లడంపై జగన్ అసహనం చెందుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో విపక్షాల నుండి విమర్శలు వచ్చే పరిస్థితి మారే అవకాశం ఉండటంతో ఇక మంత్రుల తీరు మారకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉండే రీతిలో జగన్ వార్నింగ్ ఇచ్చే రీతిలో రెడీ అయినట్లు టాక్.