NewsOrbit
రాజ‌కీయాలు

కులాభిమానం లేనిది ఎవరికి..? సోముని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు..??

why somu is being targeted on cast bias

ఏపీలో రాజకీయాలన్నీ కులాల చుట్టూనే తిరుగుతూంటాయనే పేరు ఉంది. టీడీపీ ఆవిర్భావమే కులాభిమానం మీద అనే వాదన కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి హవా మొదలయ్యాక ఆ వర్గమే పార్టీని నడిపించేవారని చెప్పుకుంటారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత రెడ్ల వర్గం ఆ పార్టీలో ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఏపీలో బలమైన వర్గంగా పేరున్న కాపులకు మాత్రం సరైన పార్టీ ప్రాతినిధ్యం లేదు. చిరంజీవి ప్రజారాజ్యం నిలబడలేక పోయింది. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కాపులకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ అని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టే సోము వీర్రాజు కూడా కాపుల్లో చరిష్మా ఉన్న చిరంజీవి, పవన్ కల్యాణ్, ముద్రగడ.. వంటి వారిని కులుపుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

why somu is being targeted on cast bias
why somu is being targeted on cast bias

చిరంజీవి, పవన్ ను కలిస్తే కాపుల బలం కోసమేనా..

సోము వీర్రాజు రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేజిక్కించుకున్నాక చిరంజీవిని, పవన్ కల్యాణ్ ను కలిసారు. దీంతో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. ‘చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతుడు లాంటోడు.. చిరంజీవిని సీఎం చేయాలన్నదే ఆయన ఉద్దేశం. ఆరెస్సెస్ ముసుగులో కాపులను రెచ్చగొడుతున్నాడు’ అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలు చేశారు. హీరోలుగా మతాలు, కులాలు, వర్గాలకు అతీతమైన అభిమానం వారి సొంతం. వారి రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు వారికి కులం అంటగట్టారనే వాదన ఉంది. కేవలం చిరంజీవి. పవన్ లను కలవడంతో బీజేపీకి కులం ముద్ర వేయడం తగదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. హర్షకుమార్ దళిత సంఘాలకు నాయకత్వం వహించడం లేదా.. అనేది వారి ప్రశ్న.

బీజేపీ వీటన్నింటికీ అతీతం..

నిజానికి బీజేపీపై హిందుత్వ పార్టీ అనే ముద్ర ఉన్నా దేశం ప్రయోజనాల కోసమే పని చేస్తుంది. కులాలు, వర్గాలు వారికి అంటవు. బీజేపీలో ఎదిగిన నాయకులెందరో దీనిని నిరూపించారు కూడా. సోము వీర్రాజు కూడా మొదటి నుంచీ బీజేపీ నాయకుడే. ఏపీ కుల సంస్కృతి ప్రకారం చూస్తే కాపు నాయకుడు. అంతమాత్రాన సోము వీర్రాజుకు కులం ముద్ర వేయడం తగదు. కాపుల్ని భుజాన వేసుకున్నంత మాత్రాన కాపులంతా బీజేపీకి సపోర్ట్ చేస్తారనే గ్యారంటీ లేదు. అదే జరిగితే ప్రజారాజ్యంకు అధికారంర.. చిరంజీవి సీఎం అయ్యేవారు. కాబట్టి బీజేపీకి, సోము వీర్రాజుకు కులాన్ని అంటగట్టడం సరికాదనేది బీజేపీ అభిమానుల మాట.

author avatar
Muraliak

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

క‌దిరిలో ‘ టీడీపీ కందికుంట‌ ‘ కు బాల‌య్య ప్ల‌స్.. !