NewsOrbit
రాజ‌కీయాలు

కేసీఆర్ ఇంత కుట్ర చేసుంటారా..!? బీసీ మంత్రికి వేటు తప్పదా..!?

will cm kcr do conspiracy on that minister

ఎవరైనా స్వశక్తితో పైకి రావాలంటే పెద్దగా కష్టం కాదు కానీ.. బలవంతంగా పైకి తీసుకురావాలంటేనే.. మరొకరిని తొక్కేయాల్సి ఉంటుంది. ఇటువంటి రాజకీయాలు అనేక రంగాల్లో జరుగుతూనే ఉంటాయి. అయితే.. బలవంతుడి ముందు బలహీనుడు ఎప్పుడే బలహీనమే. పైగా.. బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇరుక్కుంటే (..కిస్తే) ఇక చెప్పేదేముంది. పైన అయ్యోరు ఏది చెప్తే అది చేయాల్సిందే. ప్రస్తుతం ఇదే కథ ఒకటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది. యువ న‌టికి మంత్రి లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. మంత్రిగారి ప‌ద‌వికి ముప్పు తెస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇదంతా ఎమ్మెల్సీ క‌విత‌కు మంత్రి ప‌ద‌వి కట్టబెట్టేందుకే అనే వాదనా లేకపోలేదు.

will cm kcr do conspiracy on that minister
will cm kcr do conspiracy on that minister

మంత్రి వెనుక రాజకీయం.. కుట్రేనా..!

సదరు మంత్రి వెనుక జరుగుతున్న ఈ వ్యవ‌హారం వెనుక రాజ‌కీయ కుట్ర దాగుందనే వార్తలు వస్తున్నాయి. ఇందుకు ఆజ్యం పోస్తోంది తెలంగాణలో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఓ మీడియా చానెల్. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేయడానికే వెనుకాడే ఓ చానెల్ ఏకంగా క్యాబినెట్ హోదా ఉన్న మంత్రిపై ఇంత ధైర్యంగా వ్యతిరేక కథనాలు ప్రసారం చేయగలదా అనేది విశ్లేషకుల మాట. నటితో అసభ్యంగా ప్రవర్తించి ప్రభుత్వానికి మచ్చ తెస్తున్నాడని ఓ మీడియా చానెల్ ప్రసారం చేయాలంటే ఎటువంటి ఆధారాలు, ధైర్యం ఉండాలి అనేది సామాన్యుడి ప్రశ్న. ఈ వ్యవహారంపై ఇంటిలిజెన్స్ కూడా రంగంలోకి దిగిందంటే వెనుక ఏదో జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

కవిత కోసమే ఇదంతా.. వార్తల్లో నిజమెంత..!

ఇదంతా ఎమ్మెల్సీ క‌విత‌ కోసమే.. అనే వ్యాఖ్యలు మరింత సంచలనం రేపుతున్నాయి. కవితను క్యాబినేట్ లో కూర్చోబెట్టేందుకే మంత్రి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారని అంటున్నారు. ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం చేసిన మరునాడే మంత్రి రాస‌లీల వ్యవ‌హారం బయటకు రావడం పలు అనామానాలకు తావిస్తోంది. ఇదే నిజమైతే.. ఆ మంత్రికి పదవి పోతే.. ఆ వ్యతిరేకతను ఎలా పూడ్చాల్లో ‘అయ్యోరు’కి బాగా తెలుసనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. కాబట్టి.. కవితకు మంత్రి పదవి పెద్ద సమస్య కాబోదు. ఎమ్మెల్సీ పదవీ కాలం 15 నెలలే ఉన్నా ఎమ్మెల్సీ అయ్యారంటే.. మంత్రిగా చూసుకోవాలనే కదా..! అందుకే పొగ పెట్టారు.. బయటకు పంపుతున్నారు అంటున్నారు. ‘రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా..’ అనే సామెత ఊరకే రాలేదు మరి.

 

 

author avatar
Muraliak

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju