NewsOrbit
రాజ‌కీయాలు

ఆ మాజీ మంత్రిపై కేసు నీరుగారినట్టేనా..??

will that case proves on ex minister

టీడీపీలోని ముఖ్యులు, మాజీ మంత్రులపై జగన్ ప్రభుత్వం గురి పెట్టింది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని బయటపెట్టే క్రమంలో కొంతమంది మాజీలపై కేసులు పెట్టారు. ఇందులో కొంతమంది జైలుకు వెళ్లి వచ్చారు. వీరిలో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ఇంకా జైల్లోనే ఉన్నారు. వీరిలో అచ్చెన్నాయుడుపై పెట్టిన కొత్త కేసుపై సాక్షాత్తూ ఏసీబీ జేడీ వెలిబుచ్చిన కొన్ని విషయాలను ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దీంతో అచ్చెన్నపై కేసు నిలబడుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై అచ్చెన్న న్యాయపరంగా వెళ్తే ప్రభుత్వమే ఇరుకున పడే అవకాశాలు కనిపిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

will that case proves on ex minister
will that case proves on ex minister

అచ్చెన్నపై ఆరోపణలేంటి.. కేసు ఎంతవరకూ వచ్చిందనేది పరిశీలిస్తే..

అవినీతికి సంబంధించి ఆధారాలతో కాకుండా కేవలం ఆరోపణలతోనే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈఎస్ఐలో వైద్య పరికరాలు, మందుల కొనుగోలులో స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఈ కేసులో ఏసీబీ జేడీ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తమ విచారణలో అచ్చెన్నాయుడికి ఎక్కడా నేరుగా డబ్బులు ముట్టినట్టు ఆధారాలు లభ్యం కాలేదని అన్నారు. విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం మాత్రం ఉందన్నారు. విచారణలో అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు దొరక్కపోతే అనేదే ప్రస్తుతం ఎదురవుతున్న ప్రశ్న. నిజంగానే అచ్చెన్న తప్పు చేశారా అంటే కేవలం సాంకేతికంగా చేసిన తప్పే కనిపిస్తోందని అంటున్నారు. తన వద్దకు వచ్చే పలు కంపెనీలను మంత్రులు సిఫార్సు చేస్తారు. కానీ అచ్చెన్న ఒప్పందం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడమే ఆయనకు చేటు చేసిందని అంటున్నారు. టెండర్లకు వెళ్లే వాటిపై ఇలా చేయకూడదు కాబట్టే అచ్చెన్నతో పాటు, ఈఎస్ఐ డైరెక్టర్ ను కూడా అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. లక్ష రూపాయిలకు మించిన కొనుగోళ్లలో జరగాల్సిన ఈ-టెండర్లు వందల కోట్ల కొనుగోళ్లలో జరక్కపోవటం, కేటాయింపుల కంటే ఎక్కువ కొనుగోళ్లు జరగడం అచ్చెన్న కొంప ముంచినట్లుగా చెబుతున్నారు.

ఆధారాలు లేకపోతే అచ్చెన్నాయుడు న్యాయపోరాటం చేస్తారా..

తన మీద ఏమీ కేసు నిర్ధారణ కాని పక్షంలో.. తనను అన్యాయంగా ఇరికించారంటూ అచ్చెన్న న్యాయపోరాటం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వంపై అప్పుడు మరింత దూకుడుగా వెళ్లే అవకాశం ఉంది. ఇదే నిజమైతే విచారణ పేరుతో అచ్చెన్నను ఇన్నాళ్లు జైల్లో పెట్టడం సాధారణ విషయం కాదు. ఇదే జరిగితే జగన్ ప్రభుత్వం కక్షపూరతి ధోరణికి వెళ్తోందనే టీడీపీ విమర్శలకు బలం చేకూరినట్టవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన తప్పుని ఏమేర నిరూపిస్తుందో చూడాలి.

author avatar
Muraliak

Related posts

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju