NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

AB Venkateswara Rao: ఏబీవీకి జగన్ పోస్టింగ్ ఇస్తారా..!? ఇంకో మెలిక ఉందా..!?

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు.. అందరికీ పరిచయం అవసరం లేని ఐపీఎస్ అధికారి. గత చంద్రబాబు ప్రభుత్వంలో చక్రాలన్నీ చేతిలో పెట్టుకుని తిప్పారు..! వైసీపీని, జగన్ ని రాజకీయంగా అడ్డుకోడానికి ఎన్ని చేయాలో అన్నీ చేశారు. అందుకే వైసీపీకి ప్రధాన శత్రువుగా మారారు.. అందుకే జగన్ సీఎం అయిన వెంటనే తన శత్రువుల జాబితాలో ఏబీవీ పేరు ముందువరుసలో ఉండడంతో.. అతని పాపాల చిట్టా బయటకు తీసి పక్కన పెట్టేసారు. సస్పెండ్ చేసారు. కొన్ని ఆరోపణలపై విచారణకు కూడా ఆదేశించారు. కాకపోతే ఐఏఎస్, ఐపీఎస్ లకు కొన్ని అదనపు హక్కులు ఉండడంతో పూర్తిగా, లోతుగా విచారణ జరగలేదు.. ఆ అంశం పక్కన పెడితే ఏబీవీపై సస్పెన్షన్ రెండేళ్లు కంటే ఎక్కువ సాగదు. నిబంధనలకు విరుద్ధం. అతనికి ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి. సుప్రీం కూడా తేల్చి చెప్పేసింది.. ఆ సుప్రీం అండ చూసుకుని.. ఏబీవీ కూడా జగన్ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నారు. తాను ఒక అధికారిననే సంగతి పక్కన పెట్టి రాజకీయా సవాళ్లు చేస్తున్నారు.. సో.. ఇప్పుడు జగన్ ఆ ఏబీవీకి పోస్టింగ్ ఇస్తుందా..? ఇవ్వదా..!? అనేదే పెద్ద వ్యవహారం..!

Will YS Jagan Government give posting to AB Venkateswara Rao or not?
Will YS Jagan Government give posting to AB Venkateswara Rao or not

ఇంకో సాకు ఉందా..!?

ఏబీవీ కుమారుడు విదేశాల్లో ఉంటాడు.. ఏబీవీ ఇక్కడ ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నప్పుడు విదేశాల ద్వారా కొన్ని పరికరాలు కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారు అనేది ఒక ఆరోపణ. అదే ఆరోపణపై రెండేళ్లు పక్కన పెట్టారు. ఇటీవల పెగాసిస్ వ్యవహారం కూడా ఏబీవీ చుట్టూ తిరిగింది. అన్నీ మర్చిపోయి ఒక ఐపీఎస్ అధికారిని ప్రభుత్వంలో భాగంగా చేసి పోస్టింగ్ ఇవ్వడానికి జగన్ ఏమి కాంప్రమైజ్ అయ్యే టైపు కాదు. అలా అని లీగల్ గా మళ్ళీ పక్కన పెట్టకూడదు. ఏబీవీకి పోస్టింగ్ కచ్చితంగా ఇవ్వాల్సిన కచ్చితమైన అవసరం ఏర్పడింది. అందుకే ఒక అప్రాధాన్య పోస్టుని ఇచ్చేస్తే పోతుందిలే అని వైసీపీలో సలహాదారులు అనుకుంటున్నారు. కానీ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలు తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు.. చూసి చూసి రాజకీయ శత్రువుకి భాగం చేసుకున్నట్టు ఉంటుంది అనేది ప్రభుత్వంలో రాజకీయ పెద్దల అనుమానం..! సో.. ఇది ఒక క్లిష్ట సమస్య. అందుకే ఇంకేదైనా సాకు చూపించి ఏబీవీని మరో ఏడాది, ఏడాదిన్నర ఆపగలమేమో అనే దిశలో అంతర్గత వర్గాల ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది..!

రాజకీయ హెచ్చరికలేనా..!?

ఏబీవీ సవాళ్లు చేయడమే ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది. “ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి సస్పెండ్ చేశారు. నా సస్పెన్షన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టు కొట్టేసింది. 22 మే 2020న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. నాపై విధించిన సస్పెన్షన్‌ చట్ట విరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని చెప్పింది. 2020 ఫిబ్రవరి 8వ తేదీ అర్ధరాత్రి నన్ను సస్పెండ్‌ చేశారు. నా మీద లేని పోని ఆరోపణలు చేశారు. అది చూసి చాలా మంది నిజమేనని నమ్మారు. నమ్మని వాళ్లు కూడా నన్ను అడగడానికి, ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. ఆ పరిస్థితి గమనించి ఒక ప్రత్రికా ప్రకటన విడుదల చేశా. మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని అందులో తెలిపా. మానసికంగా నాకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపా.. చట్ట ప్రకారం నాకున్న అవకాశాలను ఉపయోగించుకున్నా.. అప్పటి నుంచి చట్ట ప్రకారం నాకున్న అవకాశాలను ఉపయోగించుకున్నా. హైకోర్టు నా అప్పీలును మన్నించింది. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం కూడా అదే ధ్రువీకరించింది” ఇది మొత్తం ఎవరు నడిపించారో ఎవర్ని వదలను అంటూ ఏబీవీ హెచ్చరికలు ఇస్తున్నారు. సో.. ఒక అధికారి ఈ విధమైన రాజకీయ హెచ్చరికలను చేయడం.. వైసీపీ పెద్దలకు గిట్టడం లేదు.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?