ఈ చర్యతో టీడీపీకి గంటా విషయంలో బోధపడినట్టేనా..??

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక రాజకీయ నాయకుడిగా ఎదిగిన టిడిపి నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పొలిటికల్ కెరియర్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించిన గంట చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో కీలక నాయకుడిగా ఎదిగి… రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టిడిపిలో జాయిన్ అయ్యారు. 2014 ఎన్నికలలో గెలిచి మంత్రి అయిన గంట ఇప్పుడు ఎమ్మెల్యేగా రాణిస్తున్నారు. అయితే గత కొన్నాళ్ల నుండి అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న గంట.. ప్రస్తుతం పవర్ లో ఉన్న వైసీపీ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే వార్తలు ఎప్పటి నుండో వస్తున్నాయి.

Visakhapatnam North MLA Ganta Srinivas Rao clears air on joining BJPఈ విషయంలో వచ్చిన న్యూస్ విషయంలో ఇప్పటివరకు ఆయన కూడా బహిరంగంగా వచ్చి ఖండించలేదు. ఇదిలావుంటే ఇటీవల టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులను చంద్రబాబు నియమించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీకి కొత్త అధ్యక్షులుగా నియమితులైన వారంతా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిమ్మకాయల రాజప్ప అబ్జర్వర్ గా హాజర్ అవ్వగా దాదాపు ఉత్తరాంధ్ర నుండి.. కీలక నేతలంతా రావడం జరిగింది.

 

టీడీపీలో కీలక నాయకులు హాజరైన టువంటి ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్రలో కీలక నేతగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గంటా రాకపోవటంతో.. ఇక దాదాపు గంట వైసీపీలోకి వెళ్లిపోయినట్లే అనే భావనలో టిడిపి ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు వెళ్లినా అందరూ ఎమ్మెల్యేలా  మాదిరిగా కాకుండా గంటా శ్రీనివాసరావు టిడిపికి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బయట ఇన్ని వార్తలు వస్తున్నా గంటా శ్రీనివాసరావు మదిలో ఏమున్నది అన్న దాని విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.