NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

వల్లభనేని వంశీ వైసీపీ కి అద్దె నాయకుడు అంటున్న యార్లగడ్డ..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గం రాజకీయం రోజుకో విధంగా మారుతున్న సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి టిడిపి పార్టీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ ప్రస్తుతం వైసీపీలో రాణిస్తున్నారు. ఇటువంటి తరుణంలో నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అనుచరులకు మరియు వల్లభనేని వంశీ అనుచరులకు మధ్య జరుగుతున్న వివాదాలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. తాజాగా వల్లభనేని వంశీ, ధుట్టా వర్గీయుల మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో బాపులపాడు మండలం బాపులపాడు లో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో వల్లభనేని- దుట్టా వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ఇరు నాయకుల ముందే అనుచరులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.

Vallabhaneni VS Yarlagadda: గన్నవరంలో మారిన రాజకీయ సమీకరణలు, వల్లభనేని  రాజీనామాతో అక్కడ ఏంజరగబోతోంది, వంశీ వైసీపీలో చేరితే యార్లగడ్డ భవిష్యత్ ...ఇదే సమయంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆ గొడవ సద్దుమణిగింది. నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గంలో జరుగుతున్న తరుణంలో కార్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం సంచలనంగా మారింది. ఈ తరుణంలో యార్లగడ్డ వెంకట్రావు వల్లభనేని వంశీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై దొంగ ఓట్లతో ఎమ్మెల్యే గెలిచాడని వంశీ పార్టీ లోకి వచ్చాక… అసలు నియోజకవర్గంలోకి రాకూడదని నిర్ణయం తీసుకున్నా కానీ నియోజకవర్గంలో రావడానికి కారణం నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేయకూడదు అని యార్లగడ్డ స్పష్టం చేశారు.

 

వల్లభనేని వంశీ వైసీపీ కి అద్దె నాయకుడు అయితే నేను అసలు నాయకుడిని..అంటూ పేర్కొన్నారు. జన్మదిన వేడుకలకి వెళ్తుంటే ఆరుసార్లు పోలీసులు ఆపడంతో తీవ్రస్థాయిలో యార్లగడ్డ మండిపడుతున్నారు.  ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసు అంటూ వెంకటరావు ఫైర్ అయ్యారు. వంశీ లాంటి నాయకుడు పార్టీలో ఉంటే పార్టీకే నష్టమని స్పష్టం చేశారు.

 

ఏది ఏమైనా గన్నవరం నియోజకవర్గంలో నాయకుల మధ్య జరుగుతున్న వివాదాలు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతున్నాయి. మొన్న దుట్టా వర్గీయులతో తాజాగా యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులతో వల్లభనేని వంశీ వర్గానికి వివాదాలు జరగటం నియోజకవర్గంలో కూడా టెన్షన్ వాతావరణానికి కారణమైంది. గన్నవరం నియోజకవర్గ రాజకీయాల్లో జరుగుతున్న వివాదాల విషయంలో జగన్ ఇన్వాల్వ్ అవ్వాలని నాయకుల మధ్య సత్సంబంధాలు క్లియర్ అయ్యే విధంగా వ్యవహరించాలని నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కోరుకుంటూన్నారు. 

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju