NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Janasena Vs YSRCP: వైసీపీ అలెర్ట్.. పవన్ పై వైసీపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు..!

Janasena Vs YSRCP: పవన్ కళ్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్రతో రాష్ట్రంలో వైసీపీ – జనసేన మధ్య అగ్గి రాజుకుంటుంది.. పవన్ కళ్యాణ్ తాజాగా నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఘాటుగా మాట్లాడారు.. ఆ మాటలకూ ఈరోజు వైసీపీ నేతలు స్పందించారు. మంత్రి దాడిశెట్టి రాజా పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. తునిలో మంత్రి మాట్లాడుతూ.. “వైసీపీ పాలన లో రాష్ట్ర ప్రజలకు కష్టాలు లేవు.. పవన్, చంద్రబాబుకి మాత్రమే కష్టాలు ఉన్నాయి.. చంద్రబాబు కష్టాల్లో వున్నారు..ఆయన కన్నీళ్లు తుడవటానికే పవన్ బయటకు వస్తున్నారు.. వైసీపీ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు. జనసేన కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు జై జగన్ అంటుంటే జగన్ మానియా చూసి పవన్ కి మతిపోయింది.. చంద్రబాబు అధికారం ఉన్నతసేపు రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు,దౌర్జన్యాలు,అక్రమాలు జరిగిన పవన్ కు కనపడవు.

చంద్రబాబు కష్టాల్లో ఉంటేనే పవన్ కు ఏపీలో లేని కష్టాలు కొత్తగా కన్పిస్తాయి.. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడమే కాకుండా, అంత కంటే ఎక్కువే రైతులకు చేస్తుంది.. ఈ రాష్ట్రంలో పవన్,చంద్రబాబు రెండు సిద్దాంతాలతో రాజకీయాలు చేస్తున్నారు.. ఒక్కరు ఏమో అమ్మే సిద్ధాంతాన్ని నమ్మితే.. ఇంకో నాయకుడు కొనే సిద్దాంతంతో రాజకీయాలు చేస్తున్నాడు. పార్టీ పెట్టి తనను నమ్ముకున్న వాళ్ళను అమ్మకానికి పెట్టడమే తన సిద్దాంతంగా పెట్టుకున్న నాయకుడు.. మంచి రేటు కోసం తాపత్రయ పడ్డుతున్నాడు.. అంటూ మండిపడ్డారు. అడ్వాన్స్ లు తీసుకుని తన రాజకీయ పార్టీని అద్దికి ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికలకు తన పార్టీ ని అద్దికి ఇవ్వటానికి మాటలు కూడా అయ్యిపోయాయి.. 2014లో అద్దెకు ఇచ్చిన పార్టీ.., 2024లో అద్దెకు సిద్దం అయింది” అంటూ దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు.

Janasena Vs YSRCP: స్పీడ్ పెంచిన జనసేన..!

మరోవైపు జనసేన పార్టీ కూడా రాజకీయ స్పీడ్ పెంచింది వైసీపీ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో పవన్ ఒక్కడే కాకుండా ఆ పార్టీ మరో నేత నాదెళ్ల మనోహర్, నాగబాబు కూడా అడపాదడపా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర మరో నెలరోజుల పాటూ కొనసాగనుంది. వారంలో రెండు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జిల్లాలో ఒక ప్రాంతానికి వెళ్లి.. ఆ జిల్లాలోని బాధిత రైతులు అందర్నీకి ఒక చోటకు చేర్చి తమ పార్టీ తరపున రూ. లక్ష సాయం అందిస్తున్నారు. ఈ వేదికపై రాజకీయంగా వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు..!

author avatar
Srinivas Manem

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju