NewsOrbit
రాజ‌కీయాలు

KTR: ఏపీ పై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు వైసీపీ నేతల కౌంటర్లు..!!

KTR: పక్కనే ఉన్న రాష్ట్రంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ పరిణామంతో కేటీఆర్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ లు ఇచ్చారు. కేటీఆర్ నోటి దురుసు తగ్గించుకుంటే మంచిదని సూచించారు. తెలంగాణ ప్రజలు జగన్ మాకు ముఖ్యమంత్రి అయి ఉంటే బాగుండును అని అనుకుంటున్నట్లు తెలిపారు. బలహీన వర్గాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ రావాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

YCP leaders counters Minister KTR's comments on AP

కరోనా విచ్చలవిడిగా వ్యాపిస్తున్న సమయంలో చికిత్స కోసం తెలంగాణ ప్రజలు ఏపీకి వచ్చారని.. కేటీఆర్, కేసిఆర్ చెప్పే వనీ వట్టి మాటలే అని..పేర్ని నాని స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇచ్చారు. ఇక ఇదే సమయంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా కేటీఆర్ వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. ఏపీ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నేనూ విన్నాను. తనకు ఎవరో ఫ్రెండ్‌ చెప్పారని ఆయన అన్నారు. నిజానికి మంత్రి మెప్పు పొందడం కోసం ఆ ఫ్రెండ్‌ కావాలనే అలా చెప్పాడని అనుకుంటున్నాం. లేదా ఆ వ్యక్తి మా పార్టీకి వ్యతిరేకం అయి ఉండొచ్చు.

YCP leaders counters Minister KTR's comments on AP

ఇవాళ ఇక్కడ నీరు పుష్కలంగా ఉంది. ఎక్కడా లోటు లేదు. పెద్ద ఎత్తున రోడ్ల మరమ్మతు పనులు చేస్తున్నాం. నా జిల్లాలోనే రూ.200 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేస్తున్నాం. వేసవిలో పనులు వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ గురించి మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్నారు. కానీ ఇచ్చారా? కానీ ఈ రాష్ట్రంలో అంతా మంచి జరుగుతోంది. కేటీఆర్ మాట్లాడినంత మాత్రాన మాకు వచ్చే నష్టమేమీ లేదు. సీఎం వైయస్ జగన్ దేశమంతా మంచి పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఆయనను ఒక మాట అంటే తనకు ప్రచారం వచ్చి, ఎదగొచ్చని తెలంగాణ మంత్రి అనుకున్నారేమో?. అంటూ వ్యంగ్యంగా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఏది ఏమైనా ఏపీలో మౌలిక సదుపాయాల విషయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.

Related posts

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?