న్యూస్ రాజ‌కీయాలు

నిమ్మగడ్డ.. ఒక మెంటల్ కేసు అంటూ వైసీపీ మంత్రి కామెంట్స్..!!

Share

ఇటీవల వైసీపీ మంత్రి కొడాలి నాని ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు పై అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అనే రకం అన్నట్టు కొడాలి నాని పేర్కొన్నారు. ఇదే టైంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kodali Nani: ఆయన ఓ ద్రోహి.. మమ్మల్ని ఏమీ చేయలేరు: ఎస్‌ఈసీ‌పై కొడాలి నాని  సంచలన వ్యాఖ్యలు - ap minister kodali nani sensational comments on sec  nimmagadda ramesh kumar | Samayam Teluguఆయన ఏమన్నారంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి చంద్రబాబు చెంచా, రాజ్యాంగ వ్యవస్థను అడ్డంపెట్టుకుని తనని విమర్శించకూడదు అనే ధోరణిలో నిమ్మగడ్డ వ్యవహారం ఉంటుంది అని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఒక మెంటల్ కేస్, మానసికంగా ఇంకా అనేక రీతులుగా డిస్టర్బ్ అయి ఉన్నాడు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం కోసం రమేష్ కుమార్ చంద్రబాబు లోకల్ ఎన్నికలు అడ్డంపెట్టుకుని నాటకాలాడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు.

 

2018 సంవత్సరంలో జరగాల్సిన లోకల్ ఎన్నికలు అప్పుడు ఎందుకు జరిపించ లేదు..? తర్వాత జరుపుతుంటే ఎందుకు అడ్డుకున్నారు..? అని కొడాలి నాని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితులు బాగా లేనప్పుడు ఇలాంటి టైమ్ లో ఎన్నికలు అని నోటిఫికేషన్ రిలీజ్ చేయటం దేనికి సంకేతం అన్నట్టుగా ప్రశ్నించారు. కాబట్టి చంద్రబాబు లాంటి వ్యక్తి మాటలు వింటే ఎవరికైనా మైండ్ చెడిపోతుందని.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి కూడా అదే జరిగింది అన్నట్టు మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు. 


Share

Related posts

దేశం పిలుస్తోంది..! రండి.., కరోనాని జయించండి..!

somaraju sharma

కరోనా టెస్ట్ ఇక మరింత సులువు..!కొత్త ధరలు తెలుసా..!?

somaraju sharma

Anasuya: ఈసారి అనసూయ మోసపోయినట్టే..మేకోవర్ తప్ప చెప్పుకోడానికి ఏముంది అంటున్న నెటిజన్స్..

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar