రాజుగారా…! మజాకా..!

Share

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: నర్సాపురం వైసిపి రఘురామకృష్ణం రాజు తాజాగా  నోరు జారి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బొచ్చులో నాయకత్వం ఎవడికి కావాలంటూ సొంత పార్టీ కార్యకర్తలపైనే కస్సుబుస్సు లాడారు. ఈ ఘటన కార్యకర్తలను విస్మయానికి గురి చేసింది.

జరిగింది ఏమిటంటే…

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక విషయంలో పార్టీలోనే రెండు వర్గాల మధ్య విబేధాలు తలెత్తడంతో ఆయన రంగంలోకి దిగి నేతలతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి మోపిదేవితో చర్చించి ఏకాభిప్రాయంతో చైర్మన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంలో కొందరు వైసీపీ కార్యకర్తలు జై జగన్, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, రఘురామకృష్ణం రాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేయడంతో ఆయన ఒక్క సారిగా చిర్రెత్తిపోయారు. ఎవడి నాయకత్వం కావాలి, బొచ్చులో నాయకత్వం, నోరు మూసుకు కోర్చోవాలంటూ కార్యకర్తలపై మండిపడ్డారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తే రాజు గారికి అంతగా కోపం ఎందుకు వచ్చిందో అర్థంకాక అభిమానులు అయోమయానికి గురి అయ్యారు.  

ఈయన వైఖరే వివాదాస్పదం

పార్టీ స్టాండ్‌కు భిన్నంగా వ్యవహరించడం ఈ రాజుగారికి కొత్తేమీ కాదు. ఒక సారి పార్లమెంట్ సెంట్రల్ హాలు వద్ద ప్రధాని మోది స్వయంగా రాజు గారు బాగున్నారా అని పలకరించడం, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ జగన్మోహనరెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంటున్న వేళ పార్లమెంట్‌లో మాతృభాష పరిరక్షణకు సంబంధించి ప్రశ్నను అడగడం, రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆందోళనను టీడీపి ప్రేరేపిత ఉద్యమం అని ఒక పక్క వైసీపీ నేతలు విమర్శలు చేస్తుంటే రైతుల ఆందోళనను తప్పుపట్టడం సరికాదంటూ వ్యాఖ్యానించడం, అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ వ్యవహారంపైనా చంద్రబాబును ఇరికించడం సాధ్యం కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.  

ఈయనేమి తక్కువోడు కాదు

కామిడీగానో, సీనియస్‌గా మాట్లాడున్నాడో అనుకుంటాము కానీ ఈయనేమీ తక్కువోడు కాదు. పారిశ్రామికవేత్త నుండి రాజకీయ నాయకుడుగా ఎదిగిన రఘురామకృష్ణం రాజు దేశ వ్యాప్తంగా మంచి లాబీయింగ్ చేయగల్గిన వ్యక్తి. ఈయనకు సచిన్ తెందుల్కర్‌తో ప్రధాని మోది, వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మగా పిలువబడే కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావుకు రఘురామకృష్ణంరాజు వియ్యంకుడు. ఇలా అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 300మంది పార్లమెంట్ సభ్యులకు, కేంద్ర మంత్రులకు విందు ఇచ్చి రాజకీయ వర్గాల్లో తనదైన ముద్రవేసుకున్నారు.    

https://www.facebook.com/VoteforTDP/videos/3016962731696691/

Share

Related posts

ఏపీలో ప్రజలు సంతోషంగా లేరు!

Mahesh

‘టిడిపి చీలిపోతుంది’!

Siva Prasad

అమెరికాలో భారత పైలట్ అరెస్ట్

sarath

Leave a Comment