ఆయన ఆందోళన అందుకే..!

అమరావతి: టిడిపి నాయకుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టి కోలుకోలేకుండా చేస్తున్నారని చంద్రబాబు శోకాలు పెడుతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆదివారం విజయసాయిరెడ్డి టిడిపిని విమర్శించారు. అమరావతి చుట్టూ కొన్న భూముల ధరలు పడిపోవడంతో పాటు వర్క్ ఆర్డర్లు లేకున్నా సిమెంట్ రోడ్లు వేసిన వారి బిల్లులు ఆగాయనీ, పోలవరం, హంద్రీనివా కాంట్రాక్టర్‌ల తొలగింపు గురించే చంద్రబాబు ఆందోళన అంతా అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.