ఇందులోనూ మతలబు ఉందా!?

Share

అమరావతి: టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరికపై చంద్రబాబు మంత్రాంగం ఉందంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. వారి పార్టీ ఫిరాయింపులపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు సంధించారు.

లక్షల  కోట్ల అవినీతి బయటపడితే జీవితాంతం జైల్‌లో మగ్గాల్సి వస్తుందన్న ఆందోళనతోనే బిజెపితో మళ్లీ సయోధ్యకు చంద్రబాబు తహతహలాడుతున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ముందుగా రాజ్యసభ సభ్యులను పంపించి రూట్ క్లియర్ చేసుకుంటున్నారనీ, వీళ్ల ద్వారా బిజెపి పెద్దలతో రాజీ కుదుర్చుకుని కేసుల నుండి బయటపడే ప్లాన్ అని  విజయసాయిరెడ్డి విమర్శించారు.

మ్యానిపులేటర్ చంద్రబాబుకు, ప్రజానాయకుడు జగన్‌కు తేడా ఇదే నంటూ మరో ట్వీట్ చేశారు. టిడిపిని ఓడించినందుకే కర్నూలు జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరు నెలల క్రితం చంద్రబాబు చెప్పిన విషయం అందరికీ గుర్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల తరువాత ప్రజలంతా నావారే, ఎవరి పట్ల వివక్ష ఉండదని సిఎం జగన్ స్పష్టం చేశారనీ ఇదే వారి మధ్య తేడా అని విజయసాయిరెడ్డి అన్నారు.


Share

Related posts

Tirath Singh Rawat : రేషన్ ఎక్కువ కావాలంటే ఏం చెయ్యాలో సలహా ఇచ్చిన నోటితీట సీఎం తీరత్ సింగ్! రాజుకున్న మరో వివాదం!

Yandamuri

కొత్త వివాదంలో కొడాలి నాని … ఇబ్బందుల పాల‌వుతున్నారా?

sridhar

Congress Party : కమలం స్పీడు ఏమాత్రం అందుకోలేకున్న కాంగ్రెస్ ! ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ‘హ్యాండ్స’ప్?

Yandamuri

Leave a Comment