NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan – ABN RK: జగన్ దూకుడు.. ఏబీఎన్ ఆర్కే సవాల్..! ఇక డైరెక్ట్ పోరు..!?

YS Jagan – ABN RK: జగన్ దూకుడు పెంచారు.. సంక్షేమ పథకాల అజెండాని అమల్లోకి తెచ్చారు.. తాను అమలు చేస్తున్న సంక్షేమానికి విలన్లు తన ప్రతిపక్షాలే అనే కోణంలో ప్రచారాన్ని పెంచారు.. వాయిస్ పెంచారు.. జగన్ దూకుడుని, ఆ విమర్శలకు ప్రతిపక్ష మీడియా కూడా కౌంటర్లు సిద్ధం చేసుకుంటుంది. జగన్ కి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిసైడ్ అయినట్టు ఉంది.. అందుకే నిన్న ఒంగోలులో సీఎం జగన్ మాట్లాడిన మాటలకు.. ఈరోజు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో కౌంటర్ కథనం రాశారు. దాంతో పాటూ “మీది పెద్ద సంక్షేమమేనా..? మీ పథకాలు, సంక్షేమం ఏపాటిదో రోజుకొక ఆర్టికల్ లో చూపిస్తాం.. మీ పథకాల ఉద్దేశాన్ని ఎండగడతాం” అంటూ సవాల్ చేసారు.

YS Jagan aggressive .. ABN RK challenge ..! And direct fighting ..!?
YS Jagan aggressive ABN RK challenge And direct fighting

వైసీపీ బలమైన వ్యూహంతో..!

ఏపీలో అప్పులు పెరిగాయి.. ఏపీ ఆర్ధిక స్థోమతకు మించి అప్పులు పెరిగాయి..” కానీ ఈ అప్పుల లెక్కలు, ఈ అప్పుల ఉద్దేశాలు రెండు పార్టీలు ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు. నిన్న ఒంగోలులో సీఎం జగన్ మాట్లాడుతూ.. “అప్పులు పెరిగాయి అంటున్నారు.. చంద్రబాబు హయాం లో భారీగా అప్పులు చేసారు. వారు చేసినట్టే నేను చేశాను. రాష్ట్ర పరిస్థితి అలా ఉంది. కానీ ఆ దుష్ట చతుష్టయం నాపై బురద చల్లుతుంది.. గోబెల్స్ ప్రచారం చేస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఏపీ అప్పుల విషయంలో కూడా జగన్ ఎదురుదాడి ఆరంభించారు. ఒకవైపు సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెల్తూ.. ఆ పథకాల చుట్టూ రాజకీయాన్ని పండించాలి అనేది సీఎం జగన్ ఉద్దేశం. అందుకే బలంగా ఆ వాదాన్ని వినిపిస్తున్నారు. పథకాలు వద్దు అంటున్నారు.. శ్రీలంకతో పోలుస్తున్నారు.. “వాళ్ళు వద్దన్నా నేను మీకు పథకాలు ఇస్తాను” అంటూ ఒక భరోసా ఇస్తూనే.. ఒకరకంగా విపక్షాన్ని విలన్ చేసే స్ట్రాటజీ ప్రయోగించారు. సో.. వైసీపీ ఒక బలమైన వ్యూహంతోనే వెళ్తుంది..!

ఏబీఎన్ ఆర్కే సవాల్.. రేపటి నుండి..!!

ఇన్నాళ్లు జగన్ స్పీచ్ కి వారానికోసారి కౌంటర్లు ఇచ్చే ఏబీఎన్ ఈరోజు మాత్రం వెంటనే ఇచ్చేసింది. ఇస్తూనే ఇకపై రోజుకొక కథనం ఉంటుంది.. మీ సంక్షేమం గొప్పేమిటో తేలుస్తాం అంటూ సవాల్ చేసింది.. సో.. ఇక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నేరుగా సీఎం జగన్, వైసీపీతో పోరుకి దిగనుంది అనేది వాస్తవం..! అయితే సంక్షేమ పథకాల అంశంతో జగన్ దే పైచేయి. ఆ పథకాల ఉద్దేశాలను ఏమైనా తప్పు పడితే పెడతారేమో తప్పితే.. ఏ పథకమూ తీసేయాలని ఏబీఎన్ లో రాయలేరు. జగన్ విమర్శలతో టీడీపీ కూడా ఆత్మరక్షణలో పడింది. “సంక్షేమ పథకాలు టీడీపీ వద్దు అంటుంది” అనే వైసీపీ ప్రచారం ద్వారా ఆ లబ్ధిదారులు నమ్మితే టీడీపీని పూర్తిగా దూరం పెట్టె అవకాశం లేకపోలేదు. అందుకే టీడీపీ నేతలు కూడా ఆచితూచి మాట్లాడుతున్నారు. సో.. ఇక మీదట ఏపీలో సంక్షేమ రాజకీయం కొన్నాళ్ళు సాగనుంది..!

author avatar
Srinivas Manem

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju