ఎవరు ఈ లలిత హిడావో .. జగన్ కోసం కేంద్రం తరఫున ఎందుకు వచ్చారు ?

Share

మూడు రాజధానుల బిల్లుకు అదేవిధంగా సీఆర్డీఏ రద్దు కు గవర్నర్ నుండి అదే రీతిలో కేంద్రం నుండి సానుకూల స్పందన రావటంతో ఈ విషయంపై రాజధాని ప్రాంత రైతులు హైకోర్టు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈనెల 27 వ తారీఖున స్టేటస్ కో ఆదేశాలు ఇస్తూ కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడానికి… లలిత హిడావో వైయస్ జగన్ తీసుకున్న 3 రాజధానులు విషయం కి మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నట్టుగా వచ్చినట్లు సమాచారం.

Today in History: Andhra Pradesh High Court completes one yearఇదే విషయాన్ని అఫిడవిట్లో తెలియజేసి కేంద్ర బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొని లేదని ఈ అంశంపై చట్టప్రకారం ఏది న్యాయమో నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టును అభ్యర్థించారు. మొత్తంమీద చూసుకుంటే రాజధానుల నిర్ణయం పై కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా లలిత హిడవో డైరెక్టుగా జగన్ ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ బిల్లుకు సపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం.

 

గతంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర శ్రీకృష్ణ కమిటీ అమరావతి రాజధానిగా పనికిరాదని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. అయినా గాని కేంద్రం ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి చంద్రబాబు అమరావతి రాజధాని గా గుర్తించారు. ఇటువంటి తరుణంలో అమరావతిలో రాజధాని కొనసాగిస్తూ విశాఖలో అదే రీతిలో కర్నూలులో కూడా రాజధాని విస్తరించడం వల్ల ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్టా అని కేంద్రం భావించిందట. దీంతో ఏపీ రాజధాని విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు విషయంలో కలుగజేసుకోకూడాదని డిసైడ్ అయినట్లు సమాచారం.  


Share

Related posts

Teachers Day Celebration: ఉపాధ్యయ దినోత్సవ వేడుకల నిర్వహణపై ఏపి ప్రభుత్వ కీలక నిర్ణయం..ఉపాధ్యాయ లోకం ఆక్షేపణ

somaraju sharma

బ్రేకింగ్ : ఇన్ని బ్యాడ్ న్యూస్ ల మధ్యలో కే‌సి‌ఆర్ కి సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన సుప్రీం కోర్టు!

arun kanna

జల ధారకు బలి పేదోడు…!! పోలవరం విషయంలో కథలెన్నో

Comrade CHE