NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఈగో టచ్ అయ్యిందిగా .. మోడీ మీద పోరాడతాడా ??

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యవస్థలు అడ్డు తగిలితే అదే రీతిలో న్యాయస్థానంలో పోరాడటానికి ఏమాత్రం వెనుకాడరు అని అందరికీ తెలుసు. ఈ రీతిలోనే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలు నాలుగు ఉన్నాయి.  మొదటిది రాజధాని మార్పు, రెండవది ప్రభుత్వ భవనానికి వైసిపి రంగులు, మూడవది ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్పు నాలుగవది ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం తప్పనిసరి చేయటం. వీటిలో ఒక్కో అంశంపై ఒక్కో రకమైన పరిస్థితులు జగన్ ఎదుర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కోర్టులు చుట్టూ తిరుగుతుండగా, ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల మార్పు విషయంలో జగన్ సర్కార్ పరువు పోయినట్లు అయింది. రాజధాని వికేంద్రీకరణ కూడా కోర్టులు చుట్టూ గవర్నర్ చుట్టూ తిరుగుతోంది.  

 

Live Updates: YS Jagan to meet Governor Narasimhan - glbnews.comఇక జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం విషయంలో ఇప్పుడు తాజాగా మోడీ సర్కార్ తీసుకున్న కొత్త విద్యా సంస్కరణలు బ్రేకు వేసినట్లయింది. దీంతో జగన్ సర్కార్ కేంద్రం కొత్త సంస్కరణల విషయంలో కాంప్రమైజ్ అవుతారా లేదా అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఏపీ లోని సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని కంపల్సరి అనే రీతిలో జగన్ సర్కార్ అప్పట్లో నిర్ణయం తీసుకోవటం అందరికీ తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం కంపల్సరీ అంటూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్షాల నుండి వ్యతిరేకత రావడంతో ఈగో కి వెళ్లి జగన్ సర్కార్ కోర్టులతో మరియు ప్రతిపక్షాలతోను పోరాడారు. హైకోర్టు వ్యతిరేకించిన సరే ప్రజాభిప్రాయం సేకరిస్తామని, పిల్లల తల్లిదండ్రుల దగ్గర అభిప్రాయాన్ని సేకరించి 90% పైగా తల్లిదండ్రులు ఈ విద్యా విధానాన్ని కోరుకుంటున్నారని వాదిస్తూ సుప్రీంకోర్టు వరకు వెళ్లారు.

 

కానీ అనూహ్యంగా కేంద్ర క్యాబినెట్ ఇటీవల ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం సంస్కరణల వలన జగన్ ఇంగ్లీష్ మీడియం విద్యావిధానానికి కేంద్రం బ్రేకులు వేసినట్లు అయింది. పరిస్థితి ఇలా ఉండగా తన ఈగో హర్ట్ అయ్యేటట్లు మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు జగన్ మళ్లీ ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం విషయంలో న్యాయస్థానంలో పోరాడతాడా అన్న చర్చ ఏపీ రాజకీయాలలో జరుగుతోంది. పట్టుబట్టి మరీ ఏపీలో అందరికి ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం అందుబాటులోకి తీసుకురావాలని జగన్ ఎంతో కృషి చేసి ఆఖరికి అనుకున్నది సాధించిన తర్వాత తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లయింది. ఇంగ్లీష్ మీడియం విద్య విధానం విషయం లో వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N