మోడీ జగన్ కాంబోలో బాబుపై పేలనున్న పోలవరం బాంబ్? నాయుడు గారికి ఎన్ని కష్టాలో?

టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రధాని నరేంద్రమోడీ ఆయన బుట్టలో పడడం లేదు.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆయన లైజాన్ నెరుపుతున్నారు.వీరిద్దరూ కలిసి త్వరలోనే పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుపై పెద్ద బాంబ్ పేల్చే సూచనలు గోచరిస్తున్నాయి. రాజకీయ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బద్ధ విరోధి. వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ను ఎన్నో విధాలుగా చంద్రబాబునాయుడు ఇబ్బందులు పెట్టారు.నానా మాటలు అన్నారు. భయంకరమైన గోబెల్స్ ప్రచారం సాగించారు.

ys jagan and modi targeted to chandra babu about polavaram issue
ys jagan and modi targeted to chandra babu about polavaram issue

అయితే మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చావుదెబ్బతీసే వైసీపీ బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడంతో జగన్ ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.ఇప్పుడు జగన్ రివర్స్ గేమ్ మొదలెట్టి చంద్రబాబునాయుడుతో ఆడుకుంటున్నారు.అదే విధంగా ప్రధాని నరేంద్రమోడీకి కూడా చంద్రబాబునాయుడు దాకా పీకల్దాకా కోపం ఉందన్నది స్పష్టం.అకస్మాత్తుగా బిజెపితో తెగదెంపులు చేసుకుని చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలకు తెరదీశారు.ఆ సందర్భంగా బీజేపీనే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ మీద కూడా బాబు నోరు పారేసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాకుండా ఇతర జాతీయ స్థాయి బీజేపీయేతర పార్టీలతో పార్టీలతో చేతులు కలిపి దేశమంతా తిరిగి బీజేపీకి ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేయటం కూడా తెలిసిందే.అంతేగాకుండా బిజెపి జాతీయ అధ్యక్షుడుగా ఉన్న అమిత్ షాపై తిరుపతిలో దాడి వరకు పరిస్థితి వెళ్లడం వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నది కమలనాథుల నిశ్చితాభిప్రాయం.

ys jagan and modi targeted to chandra babu about polavaram issue
ys jagan and modi targeted to chandra babu about polavaram issue

మోడీ ఏవిషయాన్ని కూడా అంత ఈజీగా మరిచిపోయే టైప్‌ కూడా కాదు. టైం దొరకాలే కానీ.. వడ్డీతో సహా ఆ పరిహారం తీస్తారనేది అందరికీ తెలుసు.ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ కూడా ఎన్డీయేతో సత్ సంబంధాలు నెరుపుతుండటంతో ప్రధాని మోడీ చంద్రబాబును దెబ్బ తీయటానికి తగిన అవకాశం లభించింది. టిడిపి హయాంలో పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీకి లిఖితపూర్వక సాక్ష్యాధార సహిత నివేదిక అందజేశారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి అక్కడ దుర్వినియోగమైన నిధుల వివరాలను తెలియజేశారు.దీంతో కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిధుల దుర్వినియోగం విషయమై విచారణ చేపట్టిందని ,ఈ విషయంలో చంద్రబాబు బుక్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మోడీ జగన్ కాంబోలో చంద్రబాబుకు రానున్నది గడ్డుకాలమని వారంటున్నారు.