YS Jagan: జగన్ చివరి క్యాబినెట్ భేటీ ఖరారు.. కీలక బిల్లులకు ఆమోదం..

Share

YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి త్వరలో నిర్వహించనున్న కేబినెట్ భేటీ కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంతో అదే చివరి కేబినెట్ భేటీ కావచ్చు. అందుకే ఆ కేబినెట్ భేటీలో కొన్ని కీలకమైన బిల్లులు, కీలకమైన ఆర్డినెన్స్ లు తీసుకువచ్చి ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ మంత్రులతో ఈ భేటీ చివరిది ఎందుకు కాబోతుంది..? ఎప్పుడు భేటీ జరగబోతున్నది..? ఈ భేటీలో జరగబోతున్న కీలకమైన బిల్లులు ఏమిటి..? అనే విషయాలను పరిశీలిస్తే.. సంక్రాంతి పండుగ తరువాత ఈ నెల 21వ తేదీన సీఎం జగన్మోహనరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగబోతున్నది. ఇంతకు ముందు నవంబర్ నెలలో సీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంలో కేబినెట్ భేటీ జరిగింది. అప్పుడు కూడా మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకురావడానికి అత్యవసరంగా కేబినెట్ భేటీ నిర్వహించడం జరిగింది.

 

సంక్రాంతి తరువాత మంత్రివర్గ ప్రక్షాళన?

ఆ తరువాత మూడు రాజధానుల రద్దు బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. నవంబర్ నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశమే చివరి మీటింగ్ అని అనుకున్నారు. మంత్రివర్గంలో చాలా మందిని మార్చేస్తారు. మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుంది, కొత్త మంత్రులు వస్తారు జరగబోయే మీటింగ్ కొత్త మంత్రులతో జరుగుతుంది అనుకున్నారు. అందుకే ఆ మీటింగ్ లో కొంత మంది మంత్రులు ఉత్సాహంగా మరి కొంత మంది నిరుత్సాహంగా కనిపించారని ఆనాడు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే మంత్రివర్గ ప్రక్షాళనలో సీఎం జగన్మోహనరెడ్డి కొంత ఆచిచూసి వ్యవహరిస్తున్నారు. ఈ నెలాఖరుకు అంటే సంక్రాంతి తరువాత అయితే మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని ఖశ్చితంగా భావిస్తున్నారు. నూటికి 90 వరకు ఏపి కేబినెట్ మంత్రివర్గంలో సంక్రాంతి తరువాత మార్పులు జరగనునన్నాయి.

ప్రాధమికంగా సిద్ధమైన మంత్రులు

సెప్టెంబర్ నెలలోనే సీనియర్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంక్రాంతి నాటికి మంత్రివర్గంలో భారీ మార్పులు జరగబోతున్నాయని ప్రకటించారు. అలానే మూడు రోజుల క్రితం సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ కూడా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు సహజమేనని స్పష్టం చేశారు. సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామని బొత్సా పేర్కొన్నారు. మంత్రులందరు ప్రాధమికంగా సిద్ధమైయ్యారు. సీఎం జగన్ కూడా తనకు ఉన్న టీమ్ ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై రిపోర్టు తెప్పించుకున్నారు. ఇప్పుడు మంత్రి పదవులు ఎవరు ఆశిస్తున్నారో. పార్టీలో మొదటి నుండి 2012 నుండి తనకు మద్దతుగా ఎవరు ఉన్నారో, సీనియర్ ఎమ్మెల్యేలు. నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యేలు, కాస్త సబ్జెక్ట్ ఉన్న ఎమ్మెల్యేలు, మంచి వాగ్దాటి ఉన్న వాళ్ల లిస్ట్ ప్రెపేర్ చేసుకుని వాళ్లతో కూడా పార్టీ పెద్ద సంప్రదింపులు జరుపుతున్నారు.

స్థానిక సంస్థల నుండి తీర్మానాలు

ఓ పక్క ఈ ప్రక్రియ జరుగుతుండటం, మరో పక్క మంత్రులు ఇలా వ్యాఖ్యలు చేస్తుండటంతో మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుంది అని స్పష్టం అవుతోంది. సీఎం జగన్మోహనరెడ్డి 2019 మే నెలలో జరిగిన మొదటి మీటింగ్ లోనే స్పష్టం చేశారు. రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని ప్రకటించి ఉన్నారు. సంక్రాంతి తరువాత మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఈ నెల 21న జరిగే కేబినెట్ భేటీలో ఒక కీలకమైన బిల్లు ఆమోదించనున్నారు. అది ఏమిటంటే .. రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, మున్సిపాలిటీల (స్థానిక సంస్థల) నుండి తీర్మానాలు తీసుకోవాలన్నది ఒకటవ ప్రతిపాదన. దానితో పాటు రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు ఒక మంత్రుల కమిటీ (కేబినెట్ ఉప సంఘం) వేయబోతున్నారు.

పకడ్బందీగా రాజధాని వికేంద్రీకరణ బిల్లు

నిజానికి రాజధాని వికేంద్రీకరణ బిల్లు తీసుకురాకముందు చేసిన తప్పులు ఏమిటంటే రైతుల ఆందోళనను పట్టించుకోలేదు. వాళ్లు ఆందోళన చేస్తారని ఆలోచించలేదు. ఇప్పుడు గతంలో జరిగిన తప్పులు లేకుండా అమరావతి ప్రాంతంలో రైతులతో మాట్లాడేందుకు మంత్రుల ఉప సంఘం ఏర్పాటు చేయడం, స్థానిక సంస్థల నుండి తీర్మానాలు తీసుకోవడం ద్వారా రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఎంత పకడ్బందీగా జరగబోతున్నది అనేది ఈ రెండు విషయాలను బట్టి చెప్పవచ్చు. కెేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఫిబ్రవరి లోగా రిపోర్టు తెప్పించుకుని ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాజధాని వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రాజధాని వికేంద్రీకరణ విషయానికి సంబంధించి వైసీపీలో అంతర్గతంలో జరుగుతున్న చర్చ ఈ విధంగా ఉంది.

సీనియర్ మంత్రులతో పార్టీ అంతర్గత కమిటీ

మరో పక్క మంత్రివర్గ ప్రక్షాళన జరగనుంది. అయితే మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే ఏమి చేస్తారు. సీనియర్ మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, బొత్స సత్యనారాయణ తదితర మంత్రుల పరిస్థితి ఏమిటి అన్న అనుమానాలు వ్యక్తం అవుతుండగా, సీనియర్ లకు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి లేదా మార్చి నెల నుండి జిల్లా స్థాయిలో పార్టీ సమీక్షలు జరగబోతున్నాయి. ఈ జిల్లా సమీక్షలకు పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేయబోతోంది. పార్టీలో వైఎస్ జగన్మోహనరెడ్డి తరువాత ఈ వైసీపీ యాక్షన్ కమిటీ (అంతర్గత) తీసుకునే నిర్ణయాలే కీలకంగా ఉండబోతున్నాయి. ఈ కమిటీ ఇచ్చే రిపోర్టుల ఆధారంగా జగన్మోహనరెడ్డి నిర్ణయాలు ఉంటాయి. ఈ కమిటీ పార్టీ బాధ్యతలు చూడబోతున్నది. ఈ కమిటీలో సీనియర్ మంత్రులు పది మంది కీలకంగా ఉండబోతున్నారనేది సమాచారం. ఈ నెలాఖరు నాటికి దీనికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Share

Related posts

KCR: కేసీఆర్ తో పేచీ… జాగ్ర‌త్త‌గా డీల్ చేస్తున్న జ‌గ‌న్ టీం

sridhar

Prabhas : ప్రభాస్ రెమ్యూనరేషన్ తో నాని లాంటి హీరో తో ఎన్ని సినిమాలు తీయోచ్చో తెలుసా..?

GRK

KCR: కేసీఆర్ , జ‌గ‌న్ … ఒకే మాట‌పై ఉంటార‌ట‌

sridhar