టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ దెబ్బకి అక్కడ టీడీపీ కి గొళ్ళెం పెట్టి తాళమేసి సీల్ చేసేశారు ? 

Share

కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక కరువు కాలంలో కూడా దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఏపీలో అమలవుతున్నాయి అంటూ పక్కరాష్ట్రాల ప్రతిపక్షాలు వాళ్ల రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను కడిగిపారేస్తున్నాయి. చాలామంది ఏపీ లో జరుగుతున్న పాలన గురించి జాతీయ స్థాయిలో కథలు కథలుగా చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహమ్మారి కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేతులెత్తేసిన తరుణంలో ఏపీ లో మాత్రం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మానవత్వంతో ఉన్నాయని చాలామంది చెబుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీలో రాజకీయ మొత్తం ఏకపక్షంగా జగన్ వైపు ఉండటంతో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీలో జాయిన్ అవ్వడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు.

 

Amaravati: CM YS Jagan reviews preparedness for receiving migrantsఇప్పటికే టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం ఇటీవల మనం చూశాం. ఇలాంటి తరుణంలో కొద్దో గొప్పో తెలుగుదేశం పార్టీకి బలం ఉన్న చోట్ల కూడా పూర్తిగా బలం లేకుండా ఆయా జిల్లాలలో మిగిలి ఉన్న టీడీపీ నేతలను వైసీపీ పార్టీలో చేర్చుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది. ఈ దెబ్బతో ప్రతిపక్షంలో ఉన్న టైంలో భూమా నాగిరెడ్డి చనిపోవడంతో వచ్చిన ఉప ఎన్నికలలో టీడీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన పార్టీని ఓడగొట్టిన జిల్లా కర్నూల్ లో ఇప్పుడు అసలు టీడీపీ పార్టీకి ఎవరు మిగలకుండా జగన్ సరైన స్కెచ్ వేసినట్లు టాక్ వస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు అండగా ఉన్న భూమా అఖిలప్రియ మరియు కేఈ వర్గాలు చాలావరకు టీడీపీకి దూరమయ్యాయి. అంతర్గత గొడవలతో వాళ్లు తమ రాజకీయ కెరీర్ ని కొనసాగిస్తున్నారు.

 

ఇదే టైమ్ లో వీళ్లంతా కలిసి త్వరలో వైసీపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు జిల్లా రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే వీరిలో ఎక్కువగా భూమా అఖిల ప్రియాకు…. చాలావరకు వైయస్ జగన్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ తల్లి శోభానాగిరెడ్డి జగన్ జైల్ లో ఉన్న టైంలో వై.ఎస్.విజయమ్మ వెనకాల వుండి మొత్తం పార్టీని భుజాలపై వేసుకోవడంతో భూమా కుటుంబానికి రాజకీయంగా వైయస్ జగన్ భుజం కాసే ఛాన్సుందని వైసీపీ పార్టీలో టాక్. మరోపక్క కేఈ ప్రభాకర్ కూడా వైసీపీ పార్టీ పెద్దలతో టచ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో టీడీపీ కి గొళ్ళెం పెట్టి జగన్ తనదైనశైలిలో స్కెచ్ వేసి తాళమేసి సీల్ చేసేశారు అని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. 


Share

Related posts

Breaking: వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలకు రెడీ అయిన ఈసీ..!!

P Sekhar

‘ప్రజలకు దత్తపుత్రుడిని, మరెవరికీ కాదు!’

Siva Prasad

Etela rajender: ఈటల బీజేపీ చేరిక ముహూర్తం ఖరారు..! ఎప్పుడు? ఎక్కడ అంటే..?

somaraju sharma