NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: జగన్ చెప్పేది నిజమే.. మోడీ ఈ మాత్రం ఆలోచించలేదా..!?

YS Jagan: Key Decision by ap cm

YS Jagan:  టీకాలపై కేంద్రం తిక్క తిక్క ఆలోచనలు చేస్తుంది.. ఒక ప్రణాళిక లేదు. ఒక పధ్ధతి లేదు. ఒక స్పష్టత లేదు.. అందుకే ఎప్పుడో ఆరునెలల కిందటే అన్ని అనుమతులు వచ్చిన టీకాలు ఇప్పటికీ కోట్లలో ఉత్పత్తి కావడం లేదు.. ఉత్పత్తి తక్కువగా ఉంది అనుకుంటే.. వాటి విక్రయ విధానాలు కూడా సరిగ్గా లేవు.. సరిగ్గా ఇదే పాయింట్ ని సీఎం జగన్ పట్టేసారు. కేంద్రానికి ఓ లేఖ రాశారు. జగన్ రాసిన లేఖలో ఏ మాత్రం అతిశయోక్తులు లేవు. ఆలోచిస్తేనే కేంద్రానికి, దేశానికి మంచిది..!

YS Jagan: Key Decision by ap cm
YS Jagan Key Decision by ap cm

YS Jagan:  బ్లాక్ మార్కెట్ మొదలయిందిగా..!!

కరోనా టీకాలపై ఇప్పటికే బ్లాక్ మార్కెట్ మొదలయింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిన్న ఒక్కో టీకా రూ. 2 వేలుకి అమ్ముతుండగా.. పోలీసులు పట్టుకున్నారు. అతని నుండి 70 టీకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆరంభం మాత్రమే.. కావాల్సిన టీకాలను ప్రైవేట్ ఆసుపత్రులు ఆర్డర్ పెట్టుకుని.. నిల్వ చేసుకుని కొరతని కాష్ చేసుకోవని గ్యారెంటీ ఏముంది..!? ఒక్కో టీకాను రూ. 5 వేలకు.. 10 వేలకు అమ్ముకోవని గ్యారంటీ ఏముంది..!? దీనికి పుష్కలంగా అవకాశాలున్నాయి. నెల రోజుల కిందట రెమెడీస్వేర్ ఇంజెక్షన్లు, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు ఎలాగైతే బ్లాక్ మార్కెట్ సృష్టించి అమ్ముకుంటున్నారో.. రేపు టీకా కూడా ఇలాగే జరగొచ్చు.. అందుకే..! సీఎం జగన్ రాసిన లేఖని పరిగణనలోకి తీసుకోవాల్సిందే..

YS Jagan: Key Decision by ap cm
YS Jagan Key Decision by ap cm

కేంద్రం విధానాలే ప్రధాన లోపం..!!

కేంద్రం ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాలు చూస్తే అయా టీకా కంపెనీలు ఉత్పత్తిలో చేసే టీకాల్లో సగం బయట విక్రయించుకోవచ్చు. సగం కేంద్ర ప్రభుత్వానికి/ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి. అంటే ఈ సగం తగ్గించేసి.. ఆ సగం వారికి ముందు ఇచ్చేస్తే.. ప్రభుత్వాలు వేసే ఉచిత టీకాల నిల్వ అయిపోయిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకాలు ఉంటె అప్పుడు అవి బ్లాక్ లో కచ్చితంగా అమ్ముకుంటాయి. అంచేత ప్రభుత్వాలు ఎలాగూ దేశం మొత్తం ఉచితంగా టీకాలు వేస్తామని చెప్పాయి కాబట్టి… కంపెనీలు ఉత్పత్తి చేసే టీకాలన్నీ కొన్ని నెలల పాటూ ప్రభుత్వాలకే అందించేలా ఉండాలి. జగన్ రాస్తున్న లేఖల్లో లోతుగా ఆలోచిస్తే కేంద్రం అమలు చేయాల్సిన నిర్ణయాలే బాగా ఉంటున్నాయి.. కానీ రాజకీయంగా చూసి వీటిని పక్కన పెడుతున్నారేమో..!

author avatar
Srinivas Manem

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju