జగన్ చిరకాల కోరిక కి ప్రజలు సై అన్నారు .. ఇక ఆగేది లేదు ! 

Share

గవర్నర్ కోటాలో ఉన్న మూడు రాజధానులు బిల్లు సీఆర్డీఏ రద్దు బిల్లు ప్రజల అంగీకారం మేరకు చట్ట సభల్లో ఆమోదం పొందటం జరిగిందని సీఎం జగన్ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు బిల్లుల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న చర్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. సెలెక్ట్ కమిటీ ప్రక్రియ ముగియడంతో ఆమోదం కోసమే ఈ బిల్లులను గవర్నర్ కి పంపించామని క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్ రాష్ట్రంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ప్రజల అభిప్రాయం మేరకు రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని నిర్ణయించినట్లు రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.

Govt would bring Anti-CAA law if necessary: Sajjala Ramakrishna Reddy

ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు ఓకే చేయడంతోనే రాజకీయంగా అనేక అడ్డంకులు ఉన్నాగాని సీఎం జగన్ పట్టుబట్టి బిల్లులు త్వరితగతిన ఆమోదం పొందేలా వ్యవహరిస్తున్నట్లు సజ్జల తెలిపారు. రాజధాని అమరావతి రైతులకి ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వస్తుందని చంద్రబాబు అండ్ కో నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నించారని సజ్జల ఆరోపించారు. ఏది ఏమైనా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా సానుకూలంగా ఉన్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఇంకా చివరిగా మిగిలింది గవర్నర్ సంతకం మాత్రమే అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజల కోరిక మేరకు కచ్చితంగా ఆమోదం పొందటం గ్యారెంటీ అని సజ్జల ఆశాభావం వ్యక్తం చేశారు. 


Share

Related posts

‘నేను సైగ చేసి ఉంటే…!’

somaraju sharma

అమిత్ షా నోట.. యుద్ధం మాట..! ఎవరితోనంటే?

somaraju sharma

Narendra Modi : మోడీ విల‌న్ … జ‌గ‌న్‌, బాబు హీరోలు

sridhar