NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇండియా వైడ్ హీరో అయ్యే ఛాన్స్ ని మిస్ చేసుకున్నా జగన్ .. ! 

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి చాలావరకూ మొండితనంగా అనుకున్నది సాధించే వరకు నిద్రపోరూ అన్న రీతిలో ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని చాలా మంది జగన్ సన్నిహితులతో పాటు ఆయనకు దగ్గరగా ఉండే రాజకీయ నేతలు కూడా చెప్పుకొస్తారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి అయ్యాక అయితే మరీను తాను తీసుకున్న నిర్ణయాల విషయంలో అనేక అడ్డంకులు వచ్చినా వాటిపై పోరాటానికి సిద్ధపడుతూ, అవసరమైతే న్యాయస్థానాలకు ఎదురుగా కూడా జగన్ వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా నిమ్మగడ్డ విషయంలో అదే విధంగా ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగుల విషయంలో చాలా వరకు న్యాయస్థానంలో తన వాదన నేగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు.

 

Man commits suicide in Nellore over AP Special Status rowఅయితే తన నిర్ణయాల విషయంలో ఏ విధంగా అయితే జగన్ పోరాటం చేశారో , రాష్ట్రానికి సంబంధించి కీలక విషయమైన ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కూడా అదే రీతిలో న్యాయస్థానంలో పోరాటం చేసి ఉంటే రాష్ట్రానికే కాదు దేశానికి హీరో అయ్యే ఛాన్స్ జగన్ కి దక్కేది అని కొంతమంది సీనియర్ నాయకులు అంటున్నారు. న్యాయబద్ధంగా విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ప్రత్యేకహోదా అనేది ముగిసిన అధ్యాయం అనే విషయంపై జగన్ న్యాయస్థానాలలో పోరాడి ఉంటే… వైసిపి పార్టీ కి మైలేజ్ వచ్చేదని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

 

అదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పోరాడిన ముఖ్యమంత్రిగా దేశంలో జగన్ కి మరింత గుర్తింపు దక్కేది అని పేర్కొంటున్నారు. ఈ విషయంలో జగన్ న్యాయస్థానానికి వెళ్ళకుండా అనవసరంగా ఛాన్స్ మిస్ చేసుకున్నారని, కేంద్రంతో కాంప్రమైజ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కొంతమంది నేతలు పేర్కొంటున్నారు. నిమ్మగడ్డ మరియు ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగుల విషయం మాదిరిగా ఏపీ ప్రత్యేక హోదా విషయంలో న్యాయస్థానాలలో జగన్ మొండివైఖరితో పోరాడితే ఏపీ రాజకీయం వేరే రకంగా ఉండేదని అభిప్రాయాలు చెప్పుకొస్తున్నారు. 

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!