NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan Schemes: సిఎం జగన్ “ఆ సంక్షేమ పథకాలు” ఆపేస్తారా..!?

YS Jagan Schemes: Can YSRCP Stop Some Schemes..!?

YS Jagan Schemes: వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తిరుగులేదు. ఎక్కడా రాజీ పడకుండా ఏ రోజున.. ఏ సంక్షేమ పథకం.. ఎంతమేరకు ఇవ్వాలి..? అనే ముందస్తు ప్లానింగ్ తో ఇచ్చేస్తున్నారు..! ఎక్కడ తక్కువ లేకండా, తేడాయే జరగకుండా చూసుకుంటున్నారు..! ఈ క్రమంలోనే నిన్నటికి నిన్న జగనన్న చేదోడు పథకం ద్వారా ఒక్కో లబ్దిదారుడికి రూ.10వేల వంతున బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసేశారు. దాదాపు 2 లక్షల 85 వేల మందికి రూ. 285 కోట్ల రూపాయల లబ్దిచేకూరింది.

వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రభుత్వం డబ్బులు ఇచ్చేస్తోంది. అమ్మఒడి పథకం జనవరిలో ఇవ్వాల్సి ఉండగా దాన్ని జూన్ కు మార్పు చేశారు. అయితే ఈ ఏడాది కొత్తగా హాజరు శాతంను అమ్మఒడికి లింక్ చేశారు. 70 శాతం హాజరు ఉన్న వాళ్లకే ఈ ఏడాది అమ్మఒడి వర్తిస్తుంది. రైతు భరోసా సంవత్సరంలో రెండు విడతలు అమలు చేస్తున్నారు. జగనన్న చేదోడు ఇస్తున్నారు. విద్యాకానుక, విద్యాదీవెన ఇస్తున్నారు. చేనేత నేస్త, కాపు నేస్తం.. ఇలా రకరకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కానీ..!

YS Jagan Schemes: Can YSRCP Stop Some Schemes..!?
YS Jagan Schemes Can YSRCP Stop Some Schemes

YS Jagan Schemes: రాయితీలు వైపు జగన్ టీమ్ చూపు..!

సంక్షేమ పథకాల నుండి ప్రభుత్వం అనుకున్న ఫలితం వస్తుందా..? లేదా అన్నదే ఆలోచించాల్సిన అంశం..! ఈ డబ్బులు తీసుకున్న వాళ్లు మళ్ళీ జగన్ కు ఓట్లు వేస్తారా..? లేదా అనే భయం వైసీపీలో కూడా అంతర్గతంగా వ్యక్తం అవుతోందట. అందుకే డబ్బుల లబ్ది ఎక్కువ కాలం గుర్తుండేలా ప్రజలకు నేరుగా డబ్బులు ఇచ్చే పథకాల కంటే రాయితీ పథకాలను అమలు చేయడం బెటరు అన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోందట. టైలర్ వృత్తిదారుడికి రూ.10 వేలు నగదు ఉచితంగా ఇచ్చే బదులు 50 శాతం రాయితీతో కుట్టు మిషన్ అందజేస్తే అతని వృత్తికి ఉపయోగపడుతుంది. పది కాలాల పాటు ఉంటుంది. అదే డబ్బులు ఇస్తే 24 గంటల్లో ఏదో ఖర్చుకు అయిపోతాయి. దీన్ని మరచిపోతారు. సో.. ఇదే లెక్కలు, లాజిక్కులు వైసీపీలో సీనియర్ నేతలు జగన్ కి వివరించే ప్రయత్నం చేశారట. ఇలా చేస్తే కొంచెం ఖర్చు కూడా తగ్గుతుందని వివరించారట.. కానీ

YS Jagan Schemes: Can YSRCP Stop Some Schemes..!?
YS Jagan Schemes Can YSRCP Stop Some Schemes

జగన్ అయిష్టమే.. వేరే విధంగా కొన్ని..!?

సీఎం జగన్ కి మాత్రం సంక్షేమ పథకాలకు కొత్త విధించడం ఇష్టం లేదట.. అందుకే వీటిని ఆపకుండా వచ్చే ఏడాది నుండి కొన్ని రాయితీ పథకాలు అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో ఇప్పుడున్న కొన్ని సంక్షేమ పథకాల్లో కొన్ని మార్పులు రానున్నట్లు సమాచారం. రాయితీ పథకాలు అమలు చేయడం వల్ల ప్రభుత్వానికి, పార్టీకి ప్రయోజనం కలుగుతుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అమ్మఒడి లాంటి పథకాలను ఒక్క సారిగా నిలుపుదల చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. జనాలు ఓట్లు వేయరు. అందుకే పథకాలను అర్ధాంతరంగా నిలుపుదల చేయకుండా వాటిని రాయితీ పథకాలుగా మార్పుచేసి అమలు చేయాలన్న ఆలోచన చేస్తోందట. ఇందు కోసం వైసీపీలోని ఒక కమిటీ సంక్షేమ పథకాలను రాబోయే రోజుల్లో ఎలా అమలు చేయాలి అన్నదానిపై కసరత్తు చేస్తోందని సమాచారం. ఇప్పుడు ఉన్న పథకాల్లో కొన్ని రూపాంతరం చెంది రాబోయే ఏడాది నాటికి రాయితీ పథకాలుగా మారనున్నాయని తెలుస్తోంది. సో.. వచ్చే ఏడాది నుండి కొన్ని పథకాల్లో సమూల మార్పులు గమనించవచ్చు..!?

author avatar
Srinivas Manem

Related posts

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju