NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ టార్గెట్ ఫిక్స్ ..! లెక్క సరిచేయడమే పని ..!!

 

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

11 కేసుల్లో ఏ 1 ముద్దాయి..! 43వేల కోట్ల అవినీతి చేశారంటూ చార్జిషీట్లు..! 16 నెలల జైలు..! తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి సంపాదనను దోచుకున్నారు అనేది సీఎం జగన్మోహనరెడ్డి పై ఉన్న పెద్ద ఆరోపణ కేసు. జగన్ జీవితం మొత్తం తెరిచి చూస్తే..మచ్చలు, మరకలుగా మిగిలిపోయేవి ఈ వ్యవహారాలే. రాష్ట్రంలో జగన్ ను విమర్శించాలి అంటే ప్రత్యర్థులకు మొదటి ఆయుధాలుగా ఇవే ఉన్నాయి. పోనీ చంద్రబాబు ఏమైనా తక్కువ తిన్నారా అంటే ఏక్కడో చిత్తూరు జిల్లాలో మారుమూల పుట్టిన చంద్రబాబు వేల కోట్లకు అధిపతి అయ్యారు. తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏన్నో అవినీతి కార్యక్రమాలను చక్కబెట్టారు. అనేక కుంభకోణాలకు తెర తీశారు. కానీ ఏ ఒక్కటీ నిరూపితం అవ్వలేదు. నిరూపితమయ్యే దశకు కోర్టులో కేసులు కొలిక్కి వచ్చే దశకు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. మరి చంద్రబాబును, జగన్ ని. లోకేష్ ని, జగన్ ని ఒక లెక్క కట్టాలి అంటే కశ్చితంగా ఇద్దరి అవినీతి వ్యవహారాలను పక్క పక్కన పెట్టి చూడాల్సిందే. అలా చూపించడమే జగన్మోహనరెడ్డి పెద్ద టార్గెట్.

చిప్పకూడు తినిపించడమే జగన్ ప్రస్తుత లక్ష్యం..!

చంద్రబాబు సుమారు 26 కేసుల్లో స్టేలు తెచ్చుకుని స్టేల మీద ఉన్నారు. ఇవన్నీ 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందు కేసులు. 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత పోలవరం ప్రాజెక్టుల టెండర్ల కేటాయింపు. అమరావతిలో ఇన్ సైటర్ ట్రేడింగ్, ఫైబర్ గ్రిడ్ ఇటువంటి అనేక స్కాములు మరిన్ని కేసులు రాబోతున్నాయి. ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఐటి మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక తతంగాలను చక్కబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఇద్దరి మీద సీబీఐ ఎంక్వైరీ వేసి, కేసులు నమోదు చేసి, చార్జిషీట్లు దాఖలు చేసి వీళ్లను అరెస్టు చేసి కొన్ని కోట్లు అవినీతికి పాల్పడ్డారు అని నిర్ధారణ జరిగితే లెక్క సరిపోయినట్లే. అది జరగాలన్నదే సీఎం జగన్ ప్రస్తుత లక్ష్యం. నిజానికి చంద్రబాబు, జగన్ ఇద్దరూ సచ్చీలులు అంటే రాష్ట్రంలో ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదు. అయితే ఎవరికి ఉన్న వారి వ్యాపకాల్లో ఏవరో ఒకళ్లు ప్రజలకు మంచి చేస్తే చాలు అనే ధోరణిలో ఉండే ఓటర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మనది. అందుకే వాళ్లు ఇద్దరు ఒకరి నొకరు ఆరోపించుకొని జైలులో పెట్టించుకునే రాజకీయాలకు తెరి తీస్తున్నారు.


కేంద్రం మద్దతు ఉంటేనే సాధ్యం కదా..!?

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి రాజ్యసభలో భేషరతుగా మద్దతు ఇస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇటీవల వ్యవసాయ బిల్లు, రాజ్యసభ డిప్యూటి చైర్మన్ ఎన్నిక ఇటువంటి కీలక సందర్భాలలో బీజేపీకి వైసీపీ ఆపద్భాంధవుడుగా నిలిచింది. ఆ తరువాత పర్యవసానాల్లో భాగంగా సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి అమిత్ షా ఆశీస్సులు తీసుకుని కొన్ని కీలక అంశాలు మాట్లాడుకున్నారు. అవి ఏమిటి అన్నది బయటకు రాకపోయినా ఏ వర్గం మీడియా వాళ్ళకు అనుకూలంగా చర్చించుకుంటున్నా, చంద్రబాబు, లోకేష్ ల అవినీతి మీద సీబీఐ దర్యాప్తు చేయించాలని అని జగన్..అమిత్ షా వద్ద ప్రస్తావించినట్లు మాత్రం ఒక పాయింట్ బయటకు వస్తుంది. అదే జరిగితే అమిత్ షా ఒక వేళ అంగీకరిస్తే..! అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్, లోకేష్ ఫైబర్ గ్రిడ్ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిగితే..! తప్పు జరిగినట్లు నిర్ధారణ చేస్తే..!చంద్రబాబు, లోకేష్ లను జైలులో పెడితే..! వీళ్ళు చేసిన అవినీతి బాగోతాలపై చార్జిషీట్లు వేస్తే..! సీబీఐ కేసులు నమోదు అియితే..! లెక్క సరిపోయినట్లే!!. జగన్ లక్ష్యం నెరవేరినట్లే!!. మరి అది జరుగుతుందా? లేదా అనేదే ప్రస్తుతం అతి పెద్ద ప్రశ్న!!.

author avatar
Special Bureau

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju