YS Jagan: నాడు వైఎస్ కి అస్త్రాయుధం.. నేడు జగన్ కి కొరకరాని విపక్షం..! ఆ మాజీ ఎంపీ రూటే వేరు..!!

YS Jagan: YS Best Friend.. Jagan Opponent EX MP
Share

YS Jagan: చంద్రబాబు చెప్తే చాదస్తం.. సొల్లు.. సొద అంటూ ఆ పాయింట్లు వినేవారు ఉండరు..! పవన్ కళ్యాణ్ చెప్తే అతి.., ఆవేశం.., అర్ధం లేని అరుపులు.., ఉత్తుత్తి మాటలు.. అంటూ పెద్దగా పట్టించుకోరు..! సోము వీర్రాజు చెప్తే పూటకో మాట, రోజుకో చోటు అంటూ వదిలేస్తారు..! కానీ ఒక్క నోటి నుండి విమర్శ వచ్చినా.. పొగడ్త వచ్చినా.. అర్ధమయ్యేలా ఉంటుంది. చిన్న పిల్లాడికి కూడా సులువుగా చెవి నుండి తలకెక్కేలా చెప్పి, తన మాటకు ముగ్ధుణ్ణి చేయడంలో ఆయన దిట్ట. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు అస్త్రాయుధంగా మారిన ఆ నాయకుడు ఇప్పుడు జగన్ కి కొరకరాని కొయ్యగా మారారు. సమాధానం లేని నోరుగా మారారు. ఆయనే ఉండవల్లి అరుణ్ కుమార్!!

YS Jagan: పార్టీ బురద వేయలేక.. ఏమి అనలేక..!!

ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ పార్టీ అంటే టపీమని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన 2014 వరకూ కాంగ్రెస్ పార్టీ ఎంపిగా పని చేశారు. రాష్ట్ర విభజన తరువాత.., కాంగ్రెస్ పార్టీ ఐసీయూలోకి వెళ్లిపోయిన తరువాత ఆయన ఏ పార్టీలోనూ చేరకుండా అలా ఉండి పోయారు. అయితే 2014 నుండి 2019 వరకూ తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తరచు మీడియా ముందుకు వచ్చి టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలను తీవ్రంగా విమర్శించారు. అప్పుడు అందరూ అనుకున్నది ఏమిటంటే.. “ఉండవల్లి వైఎస్ఆర్ సన్నిహితుడు కావడం వల్ల వైఎస్ జగన్ కు దగ్గర అవుతున్నారేమో, ఆ పార్టీలో చేరకుండా ఆ పార్టీకి పరోక్షంగా మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారేమో” అని కొందరు భావించారు. అదే మాదిరిగా టీడీపీ కూడా ఆయనను కాంగ్రెస్ వాదిగా, వైసీపీ వాదిగా చూసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండేళ్లగా ఉండవల్లి ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించలేదు. కాకపోతే ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను ఎత్తిచూపుతూ సీఎం జగన్ కు పలు సూచనలు అయితే చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న సీరియస్ కామెంట్స్ వైసీపీని, జగన్ ను బాగా టెన్షన్ పెడుతున్నాయి. ఉండపల్లి తన వాక్ చాతుర్యంతో ప్రజలకు అర్ధమయ్యేలా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం వల్ల అధికార పక్షం నుండి గట్టిగా కౌంటర్ ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు.

YS Jagan: YS Best Friend.. Jagan Opponent EX MP
YS Jagan: YS Best Friend.. Jagan Opponent EX MP

జనంలో చర్చ.. వైసీపీలో రచ్చ..!!

ఇటీవల ఉండవల్లి మీడియా సమావేశంలో “ప్రభుత్వం ఆరు లక్షల కోట్లు అప్పు చేసిందనీ, ఆరు లక్షలకు 42వేల కోట్లు వడ్డీ చెల్లిస్తోందనీ వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎప్పుడెప్పుడు ఏ రూపంలో అప్పు తీసుకువచ్చారు. దానికి వడ్డీ ఎంత, అప్పు తీసుకునేందుకు కేంద్రం వద్ద ఎటువంటి నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది” అనే అంశాలను వివరించారు.. అంతకు ముందు ఓ మీడియాతో మాట్లాడుతూ “జగన్ రెండేళ్ల పరిపాలనకు సున్నా మార్కులు వేస్తానన్నారు” కొన్ని సందర్భాల్లో
రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోయింది. ఐఏఎస్‌లు, సలహాదారులు ఏమి చేస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఉండవల్లి వ్యాఖ్యలకు అధికార పార్టీ నుండి ఇంత వరకూ కౌంటర్ లు ఇవ్వలేదు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర రాజేంద్ర నాథ్ గానీ, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాటిమాటికీ మీడియా ముందుకు వచ్చే మంత్రి కొడాలి నానీ గానీ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు గానీ ఉండపల్లి వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వలేదు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డికి సన్నిహితుడు కావడం, ఆయన ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేకపోవడం, చేసిన ఆరోపణలు, వ్యాఖ్యల్లో వాస్తవాలే ఉండటం, ఆయనపై వ్యక్తిగతంగా విమర్శించడానికి ఏమీ లేకపోవడంతో అధికార పార్టీ నేతలు ఉండవల్లి వ్యాఖ్యలను తిప్పికొట్టలేకపోతున్నారు. అలా ఉండవల్లి తండ్రికి స్నేహితుడిగా.., జగన్ కి అర్ధం కానీ విపక్ష వాదిగా ఉండిపోయారు..!


Share

Related posts

అయ్యా ఫిరాయింపు చట్టం చదువుకోండి!

Siva Prasad

Panchayat Polls : గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కు సర్వం సిద్ధం

somaraju sharma

అచ్చెన్నతో సహా టీడీపీ నేతల గృహనిర్బంధం..పలాసలో హైటెన్షన్

somaraju sharma