రాజ‌కీయాలు

YS Konda Reddy Areest: పులివెందులలో సీఎం జగన్ సమీప బంధువు అరెస్ట్..!!

Share

YS Konda Reddy Areest: ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన సమీప బంధువు చక్రాయపేట మండలం వైసిపి ఇన్చార్జి వైయస్ కొండారెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. విషయంలోకి వెళితే పులివెందుల – రాయచోటి మార్గంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ పనులకు సంబంధించి ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంది. అయితే ఆ సంస్థ యజమానులపై వైయస్ కొండారెడ్డి బెదిరింపులకు దిగటంతో… సంస్థ యాజమాన్యం ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.

YS Konda Reddy Areest In Pulivendula constituency

వైయస్ కుటుంబానికి బంధువు కావడంతోపాటు అధికార పార్టీ ఇంచార్జి అయిన నేపథ్యంలో.. ఎస్.ఆర్.కె కన్స్ట్రక్షన్ కంపెనీ చాలా ఆలోచించి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బెదిరింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించిన ఆధారాలతో సహా చక్రాయపేట పోలీస్ స్టేషన్ లో.. ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకెళ్లడంతో.. తన పేరు చెప్పి కాంట్రాక్టర్లను బెదిరించడనీ సీఎం జగన్ దృష్టికి వెళ్ళినప్పుడు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించడం జరిగింది అంట. దీంతో వైయస్ కొండారెడ్డి అరెస్టు చేసి కోర్టుకు కడప ఎస్పీ అన్బురాజన్ హాజరు పరచటం జరిగింది.

వైయస్ కొండారెడ్డి గతంలో రైల్వేకోడూరులో పార్టీ ఇన్చార్జిగా పనిచేశారు. అక్కడ కూడా తోటి నాయకులతో గొడవ పడుతూ ఉండటంతో ఆయనను.. చక్రాయపేట మండల వైసిపి పార్టీ ఇన్చార్జిగా నియమించడం జరిగిందట. ఈ క్రమంలో కాంట్రాక్ట్ పనుల విషయంలో జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న ట్లు.. జగన్ దృష్టికి వెళ్లడంతో సమీప బంధువు అయిన సరే వెంటనే చట్టపరమైన చర్యలు వైయస్ కొండారెడ్డి పై తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందట. దీంతో కడప పోలీసులు వైయస్ కొండారెడ్డినీ అరెస్టు చేయటం పులివెందులలో సంచలనంగా మారింది.


Share

Related posts

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో భారీ టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్..!!

sekhar

Nimmagadda : సజ్జల, ప్రవీణ్ ప్రకాష్ లపై చర్యలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖాస్త్రాలు…

somaraju sharma

KCR : కేసీఆర్ లాగే… భారీ గుడ్ న్యూస్ సిద్ధం చేస్తున్న జ‌గ‌న్‌

sridhar