NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Sharmila: షర్మిల పార్టీ సెన్సేషనల్ సర్వే..! ఏపీలో ఎన్ని సీట్లు గెలుస్తారో తెలుసా..!? Exclusive Report

YS Sharmila: Party Sensational Survey.. Exclusive Report

YS Sharmila: వైఎస్ షర్మిల.. ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో ఫోకస్ పెట్టారు..! అన్నతో ఆస్తి గొడవ వలన కానీ.., అన్నతో రాజకీయ విబేధాలు అవ్వనీ.., వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన కానీ… కారణం ఏదన్నా కావచ్చు ఆమె మాత్రం ఏపీలో రాజకీయ పార్టీ పెట్టె ఆలోచనలో ఉన్నట్టుగా ఇటీవల ఆమె వ్యాఖ్యలు, కొన్ని వార్తలు వస్తున్నాయి. పనిలో పనిగా ఆమె టీమ్ ద్వారా “అసలు ఏపీలో పార్టీ పెడితే ఎలా ఉంటుంది..? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది..!? ఎక్కెడెక్కడ తన ప్రభావం ఉంటుంది..!? అనే కోణంలో కొన్ని సర్వే సంస్థలతో ప్రత్యేక సర్వేలు చేయించుకున్నారట. ఇప్పుడు ఆ రిపోర్ట్ సంచలనంగా మారింది. ఒకరకంగా ఆమె ఏపిలో రాజకీయ పార్టీ పెడితే ఓ పెద్ద మలుపు..! ఓ పెద్ద ట్విస్ట్ ఖాయమే..! వాస్తవానికి ఏపిలో షర్మిల పార్టీ పెడితే ఏమవుతుంది.. ? ఎవరికి నష్టం..? తన అన్న జగన్మోహనరెడ్డికే నష్టం..? ఎంత నష్టం ఉంటుంది..? ఏయే నియోజకవర్గాల్లో నష్టం ఉంటుంది..? షర్మిల పార్టీ వల్ల వైసీపీ ఎన్ని సీట్లపై ప్రభావం పడుతుంది..? అనే విషయాలను పరిశీలిస్తే..

YS Sharmila: సర్వే వివరాలు.. ప్రత్యేకంగా..!!

ఏపిలో షర్మిల పార్టీ పెడితే జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీకి సుమారుగా 35 నుండి 40 నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందట. సీమతో పాటూ.., కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ ఆమె పార్టీ కారణంగా జగన్ కి నష్టం తప్పదని ఆ సర్వే తేల్చింది.

YS Sharmila: Party Sensational Survey.. Exclusive Report
YS Sharmila Party Sensational Survey Exclusive Report

* ప్రధానంగా కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీకి అభిమానులు ఎక్కువ. ఆ అభిమానం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా జగన్ పైనా, షర్మిల పైనా ఉంటుంది. రాజకీయంగా అంటే జగన్మోహనరెడ్డికి కాస్త ఎక్కువ అభిమానం ఉండవచ్చు. షర్మిల అంటే తక్కువ అభిమానం ఉండవచ్చు. కానీ.. ఆమె గనుక పార్టీ పెడితే వైఎస్ఆర్ పేరుతోనే పార్టీ పెడతారు. తండ్రి సెంటిమెంట్ ను వాడుకుంటారు. అన్న పరిపాలనలో లోపాలను ప్రజలకు వివరిస్తున్నారు. కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 15 వేల ఓట్లు వస్తాయని ఒక అంచనా… రాజంపేట, పొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, రైల్వే కోడూరు, కమలాపురం ఈ ఆరు నియోజకవర్గాల్లో జగన్ పార్టీకి షర్మిల పార్టీ వల్ల బాగా ఇబ్బంది ఎదురవుతుంది. అంటే అక్కడ షర్మిలకు గెలిచే అవకాశం లేదు.. అలాగని జగన్ పార్టీకి కూడా దెబ్బ కావడం ఖాయం. ఇది టీడీపీకే లాభించే అవకాశం ఉంది.

Read It (Exclusi Article) YS Sharmila: ఏపీలో షర్మిల పార్టీ – అన్నకు బ్లాక్ మెయిలింగా..!? అన్నాచెల్లెళ్ల డ్రామాలా..!?

* కడపలో ఆరు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుండగా, కర్నూలులో నాలుగు నియోజకవర్గాల్లో, అనంతపురం జిల్లాలో మూడు, చిత్తూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో కచ్చితంగా ప్రభావం ఉంటుంది. రాయలసీమ మొత్తం మీద 16 నియోజకవర్గాల్లో షర్మిల పార్టీ వల్ల వైసీపీకి నష్టం జరుగుతుందని ఆ సర్వే లెక్కలు వేసారట. అంటే ఈ నియోజకవర్గాల్లో షర్మిల గెలవలేరు.. కానీ తన పార్టీ ముద్ర వేయగలరు.

YS Sharmila: Party Sensational Survey.. Exclusive Report
YS Sharmila Party Sensational Survey Exclusive Report

* ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 29 ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు ఉన్నాయి. వీటిలో 27 స్థానాలను వైసీపీ గత ఎన్నికల్లో గెలుచుకుంది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో వైసీపీ అత్యంత బలమైన పార్టీ. టీడీపీ, జనసేన ఆ నియోజకవర్గాల్లో బలహీనంగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఆయన మార్క్ కారణంగా బడుగు బలహీన అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వైఎస్ఆర్ దగ్గర అయ్యారు. అదే విధంగా ఇప్పుడు జగన్మోహనరెడ్డి కూడా ఆ వర్గాలకు దగ్గర అయ్యారు కాబట్టి ఆ నియోజకవర్గాలు అన్నీ వైసీపీ ఖాతాలో పడ్డాయి. వైఎస్ఆర్ కుమార్తె గా షర్మిలను కూడా ఆయా నియోజకవర్గాల్లో అభిమానిస్తారు. రాయలసీమలోని ఎస్సీ నియోజకవర్గాలు పోను ఇతర ప్రాంతాల్లో ఉన్న 20 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో షర్మిల పార్టీ ప్రభావం 12 నియోజకవర్గాల్లో ఉంటుంది. ఈ నియోజకవర్గాల్లో కనీసం 6 నుండి 10 వేల ఓట్లు వరకు షర్మిల చీల్చే అవకాశం ఉంది. ఈ లెక్కన రాయలసీమలో 15, ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు కూడా 12 ప్రాంతాల్లో షర్మిల పార్టీ ప్రభావం ఉంటుంది. ఇదే కాకుండా మరో కీలకవర్గంగా ఉన్న క్రీస్టియానిటీ ఓట్లు, రెడ్డి, మైనార్టీలు అధికంగా ఉన్న సుమారు 15 నియోజకవర్గాల్లోనూ షర్మిల ప్రభావం ఉంటుంది. ఈ నియోజకవర్గాల్లో కనీసం పదివేల వంతున ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. ఆమె పార్టీ అభ్యర్ధులు గెలవడం కష్టమే. ఒకటి, రెండు స్థానాలు కూడా గెలవడం కష్టమే. కానీ కనీసం 35 నుండి 40 నియోజకవర్గాల్లో వైసీపీ ఓట్లు ఆమె గణనీయంగా చీల్చడం ఖాయమే. ఒకరకంగా వైసీపీ ఓటమికి కారణం అవుతుంది. షర్మిల పార్టీ పెడితే జగన్మోహనరెడ్డికి ఇబ్బందులు తప్పవు. అందుకే షర్మిల ఏమి అడిగినా జగన్మోహనరెడ్డి ఇవ్వడానికే సిద్ధమవుతారు కానీ పార్టీ పెట్టడానికి ఒప్పుకోరు. నిజంగా షర్మిల పార్టీ పెడతారా..? అంటేే పెట్టే అవకాశం అంతగా లేదు. తనకు సంబంధించి ఆస్తుల వ్యవహారాలను సాధించడం కోసం బెదిరించడానికే ఈ ఎత్తుగడ వేశారన్న మాటలు కూడా వినబడుతున్నాయి.
(షర్మిల పార్టీ పెడతారా..? పెట్టె అవకాశాలు ఉన్నాయా లేదా..!? అనే కథనం లింకులో చూడవచ్చు..!) 

Read It (Exclusi Article)  YS Sharmila: ఏపీలో షర్మిల పార్టీ – అన్నకు బ్లాక్ మెయిలింగా..!? అన్నాచెల్లెళ్ల డ్రామాలా..!?

author avatar
Srinivas Manem

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju