Ys Sharmila : షర్మిల పొలిటికల్ గేమ్ ప్లాన్ ఎవరివైపు.. ఎటువైపు..?

ys sharmila political strategy
Share

Ys Sharmila : వైఎస్ షర్మిల Ys Sharmila తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులు రాబోతున్నాయా? వచ్చే ఎన్నికల్లోపు రాజకీయ సమీకరణాలు మారతాయా? పార్టీల తీరు మారనుందా? అంటే.. ప్రస్తుత పరిస్థితులు అలానే తలపిస్తున్నాయి. ఇందుకు కారణం షర్మిల కొత్త పార్టీ పెట్టడమే. ఇందుకు తెలంగాణలోని స్థానిక సమీకరణాలే పార్టీలకు బలంగా కాబోతున్నాయని చెప్పాలి. తెలుగు రాష్ట్రాలే అయినా.. ఏపీలో, తెలంగాణలో భిన్న రాజకీయ పరిస్థితులు ఉంటాయి. ఏపీలో కుల ప్రాతిపదికన ఉంటే.. తెలంగాణలో మత ప్రాతిపదికన రాజకీయాలు జరుగుతాయి. తెలంగాణ మొత్తం కాకపోయినా హైదరాబాద్ లో బీజేపీ-ఎంఐఎం పార్టీల మధ్య ఉండే వాతావరణమే తెలంగాణలో ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు వీరికి జతగా షర్మిల పార్టీ చేరబోతోందని చెప్పాలి.

ys sharmila political strategy
ys sharmila political strategy

ఈనెల 9న ఖమ్మంలో షర్మిల తలపెట్టిన పొలిటికల్ మీటింగ్ కు పోలీసుల అనుమతి వచ్చింది. దీంతో రేపు యధావిధిగా సభ జరుగబోతోంది. దీంతో తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణానికి తెర లేస్తోంది. బీజేపీ హిందూత్వంలో ముందుకెళ్తోంది. ఇన్నాళ్లూ హైదరాబాద్ కే పరిమితమైన మజ్లిస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగానే కాదు.. ఇతర రాష్ట్రాల్లో కూడా హవా చూపిస్తోంది. బీహార్ ఎన్నికల్లో 5 స్థానాలు సాధించడమే ఇందుకు ఉదాహరణ. షర్మిల పార్టీ అధికారికంగా కాకపోయినా ఆమె భర్త బ్రదర్ అనిల్ ప్రభావం చాపకింద నీరులా ఉండనే ఉంటుంది. దీంతో క్రిష్టియన్ల ఓటింగ్ పై షర్మిల కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇది కాకుండా.. స్వతహాగా గతంలో వైఎస్ ప్రధాన ఓటు బ్యాంకు అయిన.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీతోపాటు హిందూ ఓటింగ్ పై ప్రభావం చూపొచ్చు.

 

ఇన్ని అంశాలు కలిసొచ్చేది ఒక్క టీఆర్ఎస్ కు మాత్రమే అని చెప్పాలి. అందుకే ఒకరిద్దరు మంత్రులు తప్పితే ఇప్పటివరకూ టీఆర్ఎస్ అగ్రనాయకత్వం షర్మిల పార్టీ ఏర్పాటుపై కామెంట్లు చేయలేదు. తెలంగాణపై ఇప్పటికీ టీఆర్ఎస్ ముద్రే ఉంది. కాంగ్రెస్ కు క్యాడర్ ఉన్నా నాయకులు లేరు. టీడీపీ ఊసులోనే లేదు. బీజేపీ కొంత బలపడుతోంది. 2023 ఎన్నికల్లోపు షర్మిల తన పార్టీని కుల ప్రాతిపదికన రెడ్డి ఓటింగ్ దిశగా తీసుకెళ్తారా? తన భర్త ఛరిష్మా ఆధారంగా మత ప్రాతిపదికన తీసుకెళ్తారా? లేదా.. తండ్రి సెంటిమెంట్ తో కాంగ్రెస్ ను కలుపుకుని వెళ్తారా.. అనేది ఆ పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలు, ప్రజల్లో మాట్లాడే అంశాలను, చేసే వ్యాఖ్యలను బట్టి ఉంటుందని చెప్పాలి.

 


Share

Related posts

KCR : కేసీఆర్ గారు… కాంగ్రెస్ ను చూసైనా మారండి స‌ర్‌

sridhar

యూపీ హెల్త్ మినిస్టర్ కి కరోనా పాజిటివ్..!!

sekhar

Tirupati : తిరుపతి తీరే వేరయా! 19 ఏళ్ల తర్వాత ఎన్నికలు!

Comrade CHE