YS Viveka Case: వైఎస్ వివేక హత్య కేసులో కొత్త ట్విస్టులు..!? సునీతరెడ్డిపై కొత్త ఫిర్యాదులు..!!

YS Viveka Case: New Twists in Sunitha Letter
Share

YS Viveka Case:  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చిక్కుముడులు వీడడం లేదు.. నెలల తరబడి ఏపీ పోలీసులు విచారణ చేసినప్పటికీ ఫలితం తేలలేదు. హంతకులు ఎవరనేది తేల్చలేదు.. ఇక కేసు సీబీఐ చేతికి వెళ్ళింది. సీబీఐ కూడా దాదాపు ఏడాది నుండి విచారణ జరుగుతూనే ఉంది.. తాజాగా గడిచిన 38 రోజుల నుండి సీబీఐ కడపలోనే తిష్ట వేసింది. వరుసగా ఒక్కొక్కరినీ పిలిచి విచారణ చేస్తుంది. ఈ క్రమంలోనే నిన్నటి నుండి కొన్ని కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి.. వివేకా కుమార్తె పై కొత్త ఫిర్యాదులు అందుతుండగా.., కొత్తగా సుబ్బారాయుడు అనే పేరు ఆమె తెరపైకి తెచ్చారు. అతని పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని ఆమె కడప ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలన మలుపుగా మారింది..

YS Viveka Case: New Twists in Sunitha Letter
YS Viveka Case: New Twists in Sunitha Letter

YS Viveka Case: సునీత అనుమానాలుతో మరో లేఖ..!?

వివేకా కేసు విచారణలో మొదటి నుండీ ఆయన కుమార్తె సునీత రెడ్డి చురుకుగా వ్యవహరిస్తున్నారు. మొదట సిట్ దర్యాప్తు సందర్భంగా పెను అనుమానాలు రేకేత్తించి.., సీబీఐ దర్యాప్తు అవసరమని కోర్టులో పిటిషన్ వేసిన ఆమె… సీబీఐ దర్యాప్తు మొదలయ్యాకా నెమ్మదిగా సాగుతుండడంపైనా ఢిల్లీ వెళ్లి మరీ ఒత్తిడి తెచ్చారు. జాతీయ స్థాయిలో సమస్యగా, వివాదంగా మార్చే ప్రయత్నం చేసారు. ఇక తేరుకున్న సీబీఐ ఈ కేసుని త్వరగా ఛేదించే పనిలో పడింది. అందుకే గడిచిన 38 రోజుల నుండి కడప, పులివెందుల ప్రాంతాల్లో తిష్టవేసి అనుమానితులను ప్రశ్నిస్తూనే ఉంది. దీనిలో మొదటి నుండి సాక్ష్యాలు తారుమారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేకా పీఏ కృష్ణారెడ్డి, వివేకానందరెడ్డి ముఖ్య అనుచరుడు యెర్ర గంగిరెడ్డి చుట్తోనే సీబీఐ దర్యాప్తు కూడా సాగుతుంది. గత 20 రోజుల నుండి సీబీఐ ఈ ఇద్దరితో పాటూ డ్రైవర్ దస్తగిరి, కంప్యూటర్ ఆపరేటర్ హిదయతుల్లాలను విచారిస్తుంది. అయితే తాజాగా సునీత రెడ్డి ఈ కేసులో మరో కొత్త పేరుని తెరపైకి తెచ్చారు. తనకు ఉన్న కొత్త అనుమానాలతో కడప ఎస్పీకి లేఖ రాశారు.

YS Viveka Case: New Twists in Sunitha Letter
YS Viveka Case: New Twists in Sunitha Letter

సుబ్బారాయుడు ఎవరు..!?

వైఎస్ సునీత రెడ్డి తాజాగా రాసిన లేఖ ప్రకారం చూసుకుంటే “కడప ప్రాంతానికి చెందిన సుబ్బారాయుడు అనే వైసీపీ నాయకుడు వివేకా హత్యా కేసులో కీలక అనుమానితుడు అనీ.. ఆయన దగ్గర చాల సమాచారం ఉండొచ్చు, అదుపులోకి తీసుకుని విచారించాలని కోరారు. దీంతో ఇప్పుడు సునీతారెడ్డి తీరుపై కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉన్నప్పుడు… ఏడాది తర్వాత ఈమె కొత్త కొత్త పేర్లు తెరపైకి తీసుకొస్తుండడంతో… సీబీఐ అధికారుల్లో కూడా కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయట. సునీత ఏమైనా దాస్తున్నార..!? ఆమె దగ్గర ఏమైనా కీలక సమాచారం ఉందా..!? ఆమె ఈ కేసుని తనకు నచ్చినట్టే మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారా…!? అనుమానితుల పేర్లు మొదట చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నట్టు..? అంటూ సీబీఐ అధికారుల మదిలో కొత్త ప్రశ్నలు మెదులుతున్నాయి. దీంతో కేసులో కొన్ని మలుపులు చోటు చేసుకున్నట్టే..!


Share

Related posts

Flash News: కర్ఫ్యూను పొడిగిస్తూ సరి కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చిన ఏపీ ప్రభుత్వం..!!

P Sekhar

ఏపీలో పట్టాలెక్కని పవను..! హైదరాబాద్ వెళ్తారట..!!

Special Bureau

‘నయీమ్‌తో అంటకాగిన వారి పేర్లేవి’

somaraju sharma