YS Jagan: సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఆల్ టైం రికార్డు సృష్టించిన ఆరోగ్యశ్రీ పథకం..??

Share

YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఇరవై ఐదు నెలలు కావస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు గత ఏడాది ఈ ఏడాది సగం వరకు వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న పరిస్థితి. మహమ్మారి వైరస్ రావటంతో ప్రపంచంలో అన్ని దేశాలలో పాలన స్తంభించడం తెలిసిందే. ఇదే రీతిలో మనదేశంలో కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు చాలా వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండటం జరిగింది. దీంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితి లో ఉండటం మాత్రమే గాక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. పరిస్థితి ఇంత కఠినతరంగా ఉన్న ఏపీలో మాత్రం వైఎస్ జగన్ ఒకపక్క సంక్షేమ పథకాలతో ప్రజలను సరైన టైంలో ఆదుకుని.. ఏక్కడ కూడా కొరత లేకుండా.. మరోపక్క ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం జరిగింది.

CM YS Jagan launches YSR Aarogyasri scheme expansion services to six districts

ఉద్యోగాలు అదేరీతిలో ఉపాధి లేని టైం లో.. ఏపీలో ప్రజలను సంక్షేమ పథకాలతో ఆదుకుంటూ జగన్ అందిస్తున్న పాలన, సంక్షేమం పట్ల ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అభినందిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే మహమ్మారి కరోనా విషయంలో దేశంలో దాదాపు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చికిత్స విషయంలో చేతులెత్తేశాయి. పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో చాలామంది పేదవాళ్ళు ధనవంతులు కరోనా చికిత్స కోసం ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి నెలకొంది. కానీ ఏపీ లో సీఎం వైఎస్ జగన్ కరోనా నీ ఆరోగ్య శ్రీ లో  చేర్పించి.. సరైన సమయంలో ఏపీ ప్రజలను ఆదుకున్నారు.

Read More: YS Jagan: వైయస్ జగన్ పాలన బాగుంది మమ్మల్ని ఏపీలో కలపండి అంటున్న ఆ రాష్ట్ర ప్రజలు..??

అదే రీతిలో ఎక్కడా కూడా రాష్ట్రంలో వైద్యులు ప్రజలను దోచుకోకుండా.. ఎక్కడికక్కడ కమిటీలు వేసి.. టాస్క్ ఫోర్స్ లు నియమించి.. మహమ్మారి కరోనా నుండి అనేక మంది ప్రజల ప్రాణాలను కాపాడటం లో చికిత్స అందించడంలో వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు కీలక పాత్ర పోషించాయి. అనేక మంది ప్రాణాలను కాపాడటం మాత్రమేకాక కుటుంబాలు కూలిపోకుండా జగన్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆర్థికంగా ప్రజలను ఆదుకోవడం జరిగింది. కాగా 2007 నుండి 2021 జూన్ వరకు .. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 34.84 లక్షల మంది లబ్ధి పొందు కోవడం జరిగిందట.

Read More: YSR Jayanti: వైఎస్ షర్మిలకు జగన్ దూరంగా ఉండటానికి కారణం ఇదే..! క్లారిటీ ఇచ్చిన వైసీపీ ముఖ్యనేత..!!

ఇదిలా ఉంటే దాదాపు జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పథకం ద్వారా చాలామంది పేదవాళ్ళు లబ్ధి పొందినట్లు.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీ పథకం ద్వారా..11.79 లక్షల మందికి ఉచిత వైద్యం అందినట్లు.. ఇది ఒక ముఖ్యమంత్రిగా జగన్ ఆధ్వర్యంలోనే ఎక్కువ మంది అనగా 25 నెలల్లోనే ఇంత మందికి సహాయం అందడం ఆల్ టైం రికార్డు అన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. దాదాపు కోట్ల 4,244 రూ.. ఆరోగ్యశ్రీ కోసం జగన్ ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగిందట. గతంలో కంటే అనేక కొత్త రోగాలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి పెంచడం మాత్రమే కాక వెయ్యి రూపాయలు దాటితే.. ఆ చికిత్స ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావడం ఇలాంటి నిర్ణయాలు జగన్ ప్రభుత్వం తీసుకోవటంతో ఈ పథకం ద్వారా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక మంది లబ్ధి పొందినట్టు ఆరోగ్యశ్రీ లెక్కలు చెబుతున్నాయి.


Share

Related posts

అమెరికా × రష్యా : బైడెన్ పై అప్పుడే పుతిన్ బాంబ్..!

Vissu

YSRCP : బిగ్ షాక్ : భయపడుతోన్న ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు ? కారణం పెద్దదే ?

somaraju sharma

డేటింగే బాగుంది… ఇప్పుడే పెళ్లి ఎందుకు? డేటింగ్ బోర్ కొడితే చూద్దాం.. షాకింగ్ వ్యాఖ్యలు చేసిన నయనతార ప్రియుడు విఘ్నేష్

Varun G