NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్సార్ మరణం – తెలుగు ప్రజల పాలిట అన్యాయం..!!

ఒకానొక సమయంలో దేశ రాజకీయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడాలన్నా, రాష్ట్రానికి సంబంధించి ఏదైనా సమస్య విషయంలో కలుగజేసుకోవలన్న ఇతర రాష్ట్రాల నాయకులు చాలా భయపడేవారు. కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టి చాలా విభిన్నంగా ఉంటుందని, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో వాళ్ళకి బాగా తెలుసు అనే టాక్ నేషనల్ స్థాయిలో ఉంది. ముఖ్యంగా వైయస్సార్ హయాంలో ఎవరు కూడా రాష్ట్రం యొక్క జోలికి వచ్చే వారు కాదు.

YS Jagan Mohan Reddy on Twitter: "One sun, One moon, One YSR ! We miss you every day ! Happy Birthday YSR Gaaru. #LegendYSRJayanthi #LegendYSRJayanthi… https://t.co/WJKc9OiHG4"ప్రత్యేక తెలంగాణ కానీ ఉద్యమం చేసిన నాయకులు కూడా రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి అప్పట్లో ఏర్పడింది. సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన ఊహించని రీతిలో ప్రజలకు అందించడంతో… పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో, చెప్పినవి చెప్పనవి కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసే వాళ్ళు. దీంతో తనదైన శైలిలో ఏపీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వైయస్సార్… రెండోసారి గెలిచిన తర్వాత మూడు నెలలకే మరణించడం నిజంగా తెలుగు ప్రజల పాలిట అన్యాయం అని జాతీయస్థాయిలో టాక్ ఉంది.

ఆయన చనిపోవడమే రాష్ట్రాన్ని ఆనాటి యూపీఎ కేంద్ర ప్రభుత్వం రెండు ముక్కలుగా చేయటంతో…. తెలుగు ప్రజలు చాలా వరకు నష్టపోవడం జరిగిందని చెప్పుకొస్తుంటారు. 2014 ఎన్నికల ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏపీలో నష్టపోయిన పర్వాలేదని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంలో వ్యవహరించిన తీరు వాళ్లకే పెద్ద ఎసరు పెట్టిందని మేధావులు ఇప్పటికే అంటారు. ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్ల రెండు సార్లు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జరిగిందో…అదే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడదీయడం నిజంగా తెలుగు ప్రజల పాలిట అన్యాయమని, నిజంగా వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్ హైకమాండ్ కనీసం ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూసి ఉండేది కాదని, ఆయన మరణించడంతోనే ఇటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అని ఇప్పటికీ చాలామంది అంటారు.

కాగా ఎప్పుడైతే రాష్ట్రాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందో ఏపీలో పూర్తిగా పట్టు కోల్పోయింది. గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలంతా పక్కన పెట్టేశారు. కానీ వైఎస్ కొడుకు వైయస్ జగన్ ని మాత్రం ఆదరిస్తూ గత సార్వత్రిక ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించి… తిరుగులేని ముఖ్యమంత్రిగా ఏపీ జనాలు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వైయస్ జగన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తండ్రికి తగ్గ రీతిలో సంక్షేమ పరిపాలన దేశంలో పెద్ద పెద్ద నాయకులకే మతిపోయేలా జరుగుతోంది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ రెండవ తారీకు వైయస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ నేతలు భారీ స్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నారు. వైయస్ జగన్ ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju