NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Chandrababu Naidu: చంద్రబాబుతో వైసీపీ నేత భేటీ..! ఆ జిల్లాలో పట్టు కోసమేనా..?

ysrcp leader met chandrababu naidu

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు Chandrababu Naidu తెలంగాణలో టీడీపీ ఉనికి పోయింది. ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఏపీలో.. పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ కి మద్దతిచ్చి టీడీపీకి దూరమయ్యారు. ఇక ఎవరు పార్టీ వీడతారో.. ఎవరు ఉంటారో అనే సందిగ్ధంలో టీడీపీని కరోనా కాపాడింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ మారి చేసేది లేక.. జగన్ కూ ఇప్పట్లో ఎవరి అవసరమూ లేక కొంత స్తబ్దత నెలకొంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు టీడీపీని కాపాడుకుంటున్నారు. అయితే.. అనూహ్యంగా ఓ వైసీపీ నేత.. అదీ కడపకు చెందిన నేత చంద్రబాబు నాయుడును కలుసుకోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.

ysrcp leader met chandrababu naidu
ysrcp leader met chandrababu naidu

కడప జిల్లా రాయచోటి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆమధ్య తిరుపతి ఉప ఎన్నిక పర్యటనలో ఉండగా కలిశారు. అప్పట్లోనే ఈ విషయం చర్చనీయాంశం అయింది. అయితే.. కొన్నాళ్లుగా మరుగునపడిన ఈ విషయం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటివలే హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో రాంప్రసాద్ మళ్లీ భేటీ అయినట్టు తెలుస్తోంది. స్థానిక రాజకీయ పరిస్థితులు, వైసీపీ తీరు, టీడీపీలో చేరడం.. వంటి విషయాలు చర్చించినట్టు సమాచారం. గతంలో కాంగ్రెస్ లో ఉండి పీసీసీ సభ్యుడిగా కూడా ఉన్నారు రాంప్రసాద్ రెడ్డి. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్ట ఈ భేటీ తర్వాత వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో నియోజకవర్గ టీడీపీ అధ్యక్ష భాద్యతలు ఇవ్వాలని కూడా కోరినట్టు సమాచారం.

YSRCP: Party Internal Big Issues Causing Loose

Read More: Mp: ‘ఎంపీ’లో టెన్షన్ మొదలైందా..? స్పీకర్ ని కలిసింది అందుకేనా..?

వీరిద్దరూ గతంలోనే శ్రీకాళహస్తిలో కలిసినప్పుడు రామ్ ప్రసాద్ ఇవే కోరారని సమాచారం. ఎన్నికల హడావిడి అయ్యాక కలుద్దామని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలేనే ఈ భేటీ జరిగిందని తెలుస్తోంది. స్థానికంగా టీడీపీని బలోపేతం చేస్తానని రామ్ ప్రసాద్ చెప్పినట్టుగా తెలుస్తోంది. జగన్ సొంత జిల్లా.. పైగా జగన్ తోనే కొన్నాళ్లు ట్రావెల్ చేసిన వ్యక్తి కావడంతో చండ్రబాబు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ ప్రసాద్ ను చేర్చుకుని జిల్లా అధ్యక్షుడిగా చేయడం అంటే చంద్రబాబే స్వయంగా కొందరిని బుజ్జగించాలి. మరి.. రామ్ ప్రసాద్ రెడ్డి చంద్రబాబుని కలిసారన్న వార్తలు నిజమే అయితే.. వైసీపీ నాయకత్వం, సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

 

author avatar
Muraliak

Related posts

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?