NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బాబాయి..బంధుత్వం కుదరదు.. పార్టీ నిర్మాణంలో జగన్ ముద్రే వేరు..!!

వైసీపీలో నెంబర్ టు ఎవరు? పార్టీలో జగన్ తర్వాత ఎవరు? విజయసాయిరెడ్డా? సజ్జల రామకృష్ణారెడ్డా?  వై.వి.సుబ్బారెడ్డా? ఏమో! ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పలేరు. జగన్ చెప్పరు. వాళ్ళు చెప్పరు. ఎవరు చెప్పలేరు. ఎవరూ ఊహించలేరు కూడా. పార్టీ భాద్యతలు పూర్తి స్థాయిలో సీఎం జగన్ నిర్వర్తిస్తుంటే.. జిల్లాల వారీగా మాత్రం భాద్యతలు పంచేందుకు ఆ ముగ్గురు నాయకులకు అప్పగించారు. ఎన్నికలకు ముందు తర్వాత కూడా 13 జిల్లాలను ముగ్గురు నాయకులు విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలకు అప్పగించారు. అంత వరకు బాగానే ఉంది. నెల రోజుల క్రిందట కూడా కొంత బాధ్యతలను పెంచి 13 జిల్లాల్లో మూడు జిల్లాలు విజయసాయిరెడ్డికి, ఐదు జిల్లాలు వైవి సుబ్బారెడ్డికి, మిగిలిన జిల్లాలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. కానీ ఈ ముగ్గురితో పాటు అనూహ్యంగా మార్పులు తీసుకు వచ్చారు. నెల రోజుల్లోనే రెండు మార్పులు చేశారు.

మోపిదేవి వెంకటరమణ కీలక బాధ్యతలు

జిల్లాల బాధ్యతలు అప్పగింతలో జగన్ అచిచూచి వ్యవహరిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించడం జిల్లాలో రెండు జిల్లాలను ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు. తాజాగా వైవీ సుబ్బారెడ్డి కి అప్పగించిన జిల్లాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలను మోపిదేవి వెంకటరమణకు ఇచ్చారు. అంటే సీనియర్ నాయకులను తనకు అత్యంత నమ్మకంగా ఉన్న నాయకులను జిల్లాల బాధ్యతలు చూసుకునేలా జగన్ నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు సాధారణ ఎమ్మెల్సీగా, మంత్రిగా మాత్రమే పార్టీలో ఉన్న మోపిదేవి వెంకటరమణ ఇక రాజ్యసభ సభ్యుడిగానూ, కీలకమైన కృష్ణా-గుంటూరు జిల్లాలకు భాద్యుడు గాను అత్యంత నమ్మశక్యమైన పాత్రను పోషించనున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కి, వైఎస్ కుటుంబానికి మోపిదేవి వెంకటరమణ అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. జగన్ తో పాటు పార్టీలోకి ఎంటర్ అయి ఆయనతో పాటు కేసులు ఎదుర్కొని అష్టకష్టాలు పడ్డారు. అందుకే జగన్ కు ప్రీతిపాత్రమైన నాయకుడిగా, నమ్మిన బంటుగా మోపిదేవి మారారు. రాజ్యసభ ఛాన్స్ కొట్టేశారు. తాజాగా అత్యంత కీలకమైన రెండు జిల్లాల బాధ్యతను తీసుకున్నారు.

మొదటి సారి పార్టీ బాధ్యతల్లో పరాయి కులానికి

పార్టీ భాద్యతలను ఇప్పటి వరకు కేవలం రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే సీఎం జగన్ అప్పగించారు. విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి ఈ ముగ్గురితో పాటు గత నెలలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు. అంటే రెడ్డి తన సొంత సామాజికవర్గం తప్ప వేరే ఎవరికి కూడా జగన్ పార్టీ బాధ్యతలు ఇవ్వలేదు. దీనిలో కొన్ని విమర్శలు ఎదురైనా పట్టించుకోలేదు. కానీ మొదటిసారి సొంత సామాజిక వర్గం కాకుండా బిసి (మత్స్యకార) సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి కి రాష్ట్రంలోనే అత్యంత కీలకం అయిన కృష్ణా గుంటూరు జిల్లాల బాధ్యతలు అప్పగించడం ద్వారా సీఎం జగన్ తన ఫందా ఏమిటో పరోక్షంగా చెప్పారు. తనకు సామాజిక వర్గం కంటే నమ్మకం, నమ్మశక్యమైన నాయకుడు ముఖ్యమని, ఏ సామాజిక వర్గమైనా నమ్మిన వారిగా ఉంటే కీలకమైన బాధ్యతలు అప్పగిస్తానని చెప్పకనే చెప్పారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

కేసీఆర్ జ‌గ‌న్‌కు హ్యాండ్ ఇచ్చేసిన‌ట్టే.. వైసీపీలో ఏం జ‌రుగుతోంది…?

క‌దిరిలో ‘ టీడీపీ కందికుంట‌ ‘ కు బాల‌య్య ప్ల‌స్.. !