అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్దలను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధానుల విషయంపై మొదట ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. యూటర్న్ తీసుకోవడంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మించిపోయాడని విమర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
‘దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడు. యూ-టర్నుల్లో యజమానిని మించి పోయాడు’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బిజెపి పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడు. యూ-టర్నుల్లో యజమానిని మించి పోయాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2020
ఇక టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా విజయసాయి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల అంశంపై టీడీపీ నేతల తీరును తప్పుబడుతూ ఆయన ట్వీట్ చేశారు. “రాజధాని అనే 10 లక్షల కోట్ల భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం చంద్రబాబు ఏ గడ్డి కరవడానికైనా సిద్ధమే. విలువలు, సిద్ధాంతాలు లేని వ్యక్తులు వ్యవస్థలన్నిటిని బలితీసుకుంటారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా ఇలాగే సాగింది. దానికి ఫుల్ స్టాప్ పడిందన్న విషయం తెలుసుకోలేక పోవడం విషాదం” అని పేర్కొన్నారు.
‘బెజవాడ రౌడీలా ప్రవర్తించి పార్టీకి మంచి పేరు తెచ్చావని 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఒక ఎమ్మెల్సీని మెచ్చుకుని తన స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకారులో ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది. తన మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు’ మరో ట్వీట్ చేశారు.
రాజధాని అనే10 లక్షల కోట్ల భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం చంద్రబాబు ఏ గడ్డి కరవడానికైనా సిద్ధమే. విలువలు, సిద్ధాంతాలు లేని వ్యక్తులు వ్యవస్థలన్నిటిని బలితీసుకుంటారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా ఇలాగే సాగింది. దానికి ఫుల్ స్టాప్ పడిందన్న విషయం తెలుసుకోలేక పోవడం విషాదం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2020
రాజధాని అనే10 లక్షల కోట్ల భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం చంద్రబాబు ఏ గడ్డి కరవడానికైనా సిద్ధమే. విలువలు, సిద్ధాంతాలు లేని వ్యక్తులు వ్యవస్థలన్నిటిని బలితీసుకుంటారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా ఇలాగే సాగింది. దానికి ఫుల్ స్టాప్ పడిందన్న విషయం తెలుసుకోలేక పోవడం విషాదం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2020
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?