NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: 50 పదవులు ఊరిస్తున్నాయి.. వైసీపీలో నామినేటెడ్ సందడి..!

YSRCP: Nominated Getting Ready in YSRCP

YSRCP:  ఎమ్మెల్సీలు.., టీటీడీ బోర్డు సభ్యులు.., నామినేటెడ్ చైర్మన్ పదవులు.., ఇతరత్రా మొత్తం మీద 50 పదవులు కళ్లెదురుగా ఊరిస్తున్నాయి.. అందినట్టే ఉన్నాయి.., కానీ కాకుండా పోతాయేమో అనే భయం వెంటాడుతుంది. ఇదీ వైసిపిలో పరిస్థితి. మాజీలు, పోటీ చేసి ఓడిన వారు, ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ మొదటి నుండి కష్టపడిన వారికీ కలిపి ఈ పదవులను భర్తీ చేయాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. ఇప్పటికీ చాలా మందికి ప్రాధమిక సమాచారం అందించారు. నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ (ఆర్టీసీ, మైనింగ్, సివిల్, పోలీసు హోసింగ్, ఫుడ్) వంటి పదవులు.., అర్బన్ అథారిటీల పదవులు.., కార్పొరేషన్ చైర్మన్ పదవులు.., టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులు.., ఎమ్మెల్సీల పదవులతో వైసిపిలో పండగ నెలకొంది. ఆయా పదవుల వేటలో ఎవరికీ వారు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.. సీఎం జగన్ ఇప్పటికే కొన్ని పేర్లు ఖరారు చేశారు. అయితే వీటిలో 50 శాతం మహిళలకే కేటాయించడానికి సీఎం జగన్ మొగ్గు చూపుతున్నారట. అందుకే కొందరు నేతలు ప్రోటోకాల్ తమకు ఉంటె బాగుంటుందని.., తమ పేరు చేర్చాలని కోరుతున్నట్టు కీలక సమాచారం.

YSRCP: Nominated Getting Ready in YSRCP
YSRCP Nominated Getting Ready in YSRCP

YSRCP:  భర్తీ చేయనున్నవి ఇవే… !

రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉన్న కార్పొరేషన్ పదవులు మూడు ఉన్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ, మైనింగ్ (భూగర్భ గనుల), సివిల్ సప్లైస్, పోలీసు హోసింగ్ సహా మరో మూడు కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి. కనీసం రెండేళ్ల కాల వ్యవధితో ఈ పదవులను ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ మూడు పదవుల్లో ఒకటి దేవినేని అవినాష్ కి ఇవ్వనున్నట్టు సమాచారం. విజయవాడ తూర్పు ఇంఛార్జిగా బాధ్యతల్లో ఉన్న అవినాష్ ప్రస్తుతం ఒక కీలక పదవిని ఆశిస్తున్నారు. ఏడాదిన్నర కిందట పార్టీలో చేరినప్పుడు కూడా ఆయనకు సీఎం నుండి స్పష్టమైన హామీ ఇచ్చినట్టు తేలిసింది. ఈయనతో పాటూ రౌతు సూర్యప్రకాశరావు, బాచిన కృష్ణ చైతన్య, విశ్వేశ్వర్ రెడ్డి, తోట వాని తదితరులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు సమాచారం. టీడీపీన్ నుండి వచ్చిన వారికి కాకుండా వైసీపీ అధికారంలోకి రాకమునుపు నుండి పార్టీ కోసం పని చేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఎక్కువగా టీటీడీ బోర్డు సభ్యులు, ఎమ్మెల్సీలు వంటి కీలక పదవులు కూడా ఉన్నాయి.

* 15 మందికి టీటీడీ బోర్డు సభ్యులుగా కేటాయించనున్నారు. పక్క రాష్ట్రాలకు మూడు పోయినా… వైసిపిలో కీలకంగా ఉండే 12 మందికి ఈ పదవులు దక్కనున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు సహా.., కొందరు మాజీలకు కూడా ఈ పదవి వరించనున్నట్టు సమాచారం.
* స్థానిక సంస్థల కోటాలో ఇప్పటికే 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. కోర్టు నుండి తీర్పు వచ్చిన వెంటనే.. స్థానిక సంస్థలో ప్రజాప్రతినిధులు కొలువుదీరిన వెంటనే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తానికి ఈ నెలాఖరు వరకు వైసీపీలో ఈ పదవుల పండగ మాత్రం కొనసాగానున్నట్టు చెప్పుకోవచ్చు.

author avatar
Srinivas Manem

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju