NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఆ ఎంపికి రోజుకో ఆయుధం…! రాజు గారి తాజా గొడవ దేనికంటే..!?

 

వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు గారి వ్యవహారం అందరికీ తెలిసిందే. గడచిన నాలుగైదు నెలల నుండి రఘురామ కృష్ణంరాజు పార్టీ పైనా, ప్రభుత్వంపైనా తిరుగు బాటు బావుటా ఎగురవేస్తూ ఉన్నారు. వైసిపిపై ఏ ఆయుధాలు దొరుకుతాయా ఇరుకున పెట్టేద్దామని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, బిజేపి కూడా చేయనన్ని ఆరోపణలను వైసిపి ప్రభుత్వంపై రఘురామ కృష్ణంరాజు చేస్తున్నాారు. అతి సున్నితమైన, సామాజిక వర్గాన్ని రెడ్లకు అధికంగా పదవులు ఇస్తున్నారని ఆయనే లేవనెత్తారు. అలాగే ఫోన్ ట్యాంపింగ్ ఆంశాన్ని కూడా అందరికంటే ఎక్కువగా రఘురామ కృష్ణంరాజే ఆరోపిస్తున్నారు. తాజాగా హిందూ మతంతో, సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న వినాయక చవితి విషయాన్ని ప్రస్థావిస్తూ కూడా ఆయన వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా విమర్శలు చేస్తున్నారు. సో రాజు గారికి రోజుకు ఒక ఆయుధం దొరుకుతోంది. పార్టీని, ప్రభుత్వాన్ని, సిఏం జగన్మోహనరెడ్డిని ఏలాగైనా ఇబ్బంది పెట్టాలి, ఇరుకున పట్టాలి అనే విధంగా రాజు గారి ఫంధా నడుస్తోంది. ఆయనను అడ్డుకట్ట వేయడం పార్టీకి, ప్రభుత్వానికి అయితే తరం కావడం లేదు.

Mp raghurama karishnam raju

 

తాజాగా ఈ రోజు యుశ్రారైకాపా ఎంపి రఘురామ కృష్ణంరాజు ఏ వ్యాఖ్యలు చేశారంటే….

రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలకు అనుమతులు ఇవ్వకపోవడంపై రఘురామ కృష్ణంరాజు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మరో లేఖ రాశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హింధూ మత సంస్థలు, స్వామీజీలు, హిందూ మత పెద్దలను సంప్రదించకుండా ఏకపక్షంగా వినాయక చవితి వేడుకల విషయంలో నిర్ణయం తీసుకోవడం హింధూ సమాజాన్ని అవమానించినట్లేనని పేర్కొన్నారు రఘురామ కృష్ణంరాజు. రాష్ట్రంలో వివాహలు, ఇతర శుభకార్యాలకు నిబంధనలతో కూడిన అనుమతులు ఇస్తున్నప్పుడు అటువంటి నిబంధనలే పెట్టి వినాయక చవితి వేడుకలకు ఎందుకు అనుమతులు ఇవ్వకూడదని ప్రశ్నించారు. వినాయక మండపాల అనుమతి విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని జగన్ కు రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. మంత్రి వెల్లంపల్లి వల్ల ప్రభుత్వానికి, సిఎం జగన్ కు చెడ్డపేరు వస్తుంది అని పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రఘురామ కృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలకు వైసిపిీ నుండి కాక బిజెపి నుండి కౌంటర్ లు వస్తున్నాయి. ఇన్నాళ్లు రఘురామ కృష్ణంరాజు గారికి బిజెపి మద్దతు ఉందని ప్రచారం జరిగింది. కానీ బిజెపి నుండి జివిఎల్ నర్శింహరావు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు కౌంటర్ లు ఇస్తున్నారు రఘురామకృష్ణంరాజుకి. అంటే ఆయన వెనుక బిజెపి కూడా లేనట్టేకనబడుతోంది. సో.. ఆయన వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నారు. అన్ని పార్టీలను అడుకుంటున్నారు. సో.. రాజు గారి రాజకీయం ఏమిటో ! రాజు గారి వ్యవహార శైలి ఏమిటో..!నర్సాపురం ప్రజలకైనా తెలుసో లేదో !!

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?